Begin typing your search above and press return to search.

కేటీఆర్ స‌మ‌క్షంలో పాల‌న‌పై సొంత నేత‌ల అసంతృప్తి!

By:  Tupaki Desk   |   23 Sep 2018 4:45 AM GMT
కేటీఆర్ స‌మ‌క్షంలో  పాల‌న‌పై సొంత నేత‌ల అసంతృప్తి!
X
కేసీఆర్ త‌ర్వాత గులాబీ పార్టీలో అన్నింటికి కేటీఆరే అన్న‌ట్లుగా ఒక్కొక్క ప‌రిణామం చోటు చేసుకుంటున్న వేళ‌.. ఊహించ‌ని షాక్ సొంత పార్టీ నేత‌ల నుంచి ఎదురైంది. త‌న ప‌ని తీరు న‌చ్చ‌కుంటే ఓటు వేయొద్దంటూ కేటీఆర్ గొప్ప‌గా వ్యాఖ్య‌లు చేస్తున్న వేళ‌.. ప్ర‌జ‌ల సంగ‌తి త‌ర్వాత సొంత పార్టీ నేత‌లే పెద‌వి విరుస్తున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ స‌మ‌క్షంలో మాజీ జెడ్పీటీసీ స‌భ్యుడు మ‌ల్లుగారి న‌ర్స‌గౌడ్ ఊహించని రీతిలో త‌న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు. తాము కోరుకున్న‌ట్లుగా పాల‌న సాగ‌టం లేద‌న్న అసంతృప్తిని వ్య‌క్తం చేయ‌టం అక్క‌డి వారితో పాటు కేటీఆర్ కు సైతం నోట మాట రాని రీతిలో త‌యారైంది.

కార్య‌క‌ర్త‌ల మ‌నోభావాలు అర్థం చేసుకొని.. కేటీఆర్ స్థానికంగా అందుబాటులో ఉండాల‌న్నారు. ఓవైపు పాల‌న‌పై అసంతృప్తితో పాటు.. కేటీఆర్ అందుబాటులోకి లేని వైనంపై నర్స‌గౌడ్ చేసిన వ్యాఖ్య‌ల‌తో కేటీఆర్ అలెర్ట్ అయ్యారు. స‌మావేశం అనంత‌రం కేటీఆర్ నుంచి పిలుపు రావ‌టం.. న‌ర్స‌గౌడ్ ఆయ‌న‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌నకు స‌ర్ది చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది.

త‌మ పాల‌న బాగోపోతే ఓటు వేయొద్ద‌ని సూటిగా చెబుతున్న కేటీఆర్ కు.. ఓట‌ర్ల సంగ‌తి త‌ర్వాత సొంత పార్టీ నేత‌లే పాల‌న‌పై పెద‌వి విర‌వ‌టం ఊహించ‌ని షాక్ గా మారింది. రానున్న రోజుల్లో ఇలాంటివి మ‌రెన్ని చోటు చేసుకుంటాయ‌న్న‌ది గులాబీ వ‌ర్గాల్లో సందేహంగా మారింది. అందుకే.. పార్టీ నేత‌ల మైండ్ సెట్ ను కాస్త స్ట‌డీ చేసి కేటీఆర్ మాట్లాడితే బాగుంటుందేమో?