Begin typing your search above and press return to search.

పంద్రాగ‌స్టు వేడుక‌లు గులాబి మయం..

By:  Tupaki Desk   |   16 Aug 2018 7:09 AM GMT
పంద్రాగ‌స్టు వేడుక‌లు గులాబి మయం..
X
దేశంలో పార్టీ జెండాలు ఎక్కువైపోయాయి, అందుకే పార్టీ జెండాకి, జాతీయ జెండాకి తేడా తెలియటం లేదు మన నాయకులకు. పంద్రాగష్టు వేడుకలలో భాగంగా సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం కేరూర్‌ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర సమితీ పార్టీకి చెందిన గ్రామాధ్యక్షుడు వీరన్న గౌడ్ జాతీయ జెండాకు బదులు తన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆ జెండాను ఆవిష్కరించిన వెంటనే అక్కడ ఉన్న చిన్నారులు మన జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ ఘటనతో అక్కడి పెద్దలందరూ ఖంగుతిన్నారు. కొద్దిగా పలుకుబడి ఉంటే చాలు ఏదో ఒక పార్టీలో చేరి, ఆ పార్టీ జెండా పట్టుకుని తిరిగడం అలావాటైన క్రింది స్థాయి నాయకులకు, జాతీయ జెండా ఒకటుందని తెలుసా అని ఆ గ్రామ ప్రజలు మండిపడుతున్నారు .

ఎప్పుడు ఏ జెండా ఆవిష్కరించాలో తెలియని నాయకులకు మాకు ఏం మేలు చేస్తాడని ఆ గ్రామ ప్రజలు వాపోతున్నారు. వీరన్న గౌడ్‌కు తెలియకుండానే ఈ పొరపాటు జరిగిందా..... లేదా.... టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కంట్లో పడడానికే ఈ సాహాసానికి పాల్పడ్డారా అని కొందరు పరీశీలకులు అనుమానపడుతున్నారు. దేశం ఏవత్తూ కూడా మువ్వన్నేలతో కళకళలాడుతుంటే, అక్కడ మాత్రం ఎక్కడ చూసినా గులాబి వర్ణమే దర్శనమిస్తోంది. జెండాయే కాకుండా జెండా నిలబెట్టాడానికి ఉపయోగించే స్తంబం, కిందనున్న దిమ్మా కూడా గులాబి మయం. దీంతో ఈ చర్యను పొరపాటని అనుకోలేమని పలువురు విమర్శిస్తున్నారు. తన అధినేత కంట్లో పడడానికే ఈ వేడుకను వీరన్న గౌడ్ వాడుకున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.