Begin typing your search above and press return to search.

కొత్త ఐడియా మంత్రిని న‌వ్వుల పాలు చేసింది

By:  Tupaki Desk   |   22 April 2017 3:04 PM GMT
కొత్త ఐడియా మంత్రిని న‌వ్వుల పాలు చేసింది
X
తమిళనాడు మంత్రి ఒక‌రు నీటి ఆవిరికాకుండా వేసిన ఐడియా.. ఆయన్ని నవ్వుల పాలు జేసింది. పళనిస్వామి మంత్రివర్గంలో పని చేస్తున్న సెల్లూర్ రాజు - ఎండలకు చెరువుల్లోని నీరు ఆవిరవ్వకుండా ఓ వెరైటీ ప్లాన్‌ చేశారు. పది లక్షల రుపాయల ఖర్చుతో వైగై డ్యామ్‌ పై మొత్తం థర్మాకోల్ పరిపించారు. అంత వరకూ బాగానే ఉన్నా.. సమస్య అప్పుడు వచ్చిపడింది. అలల తాకిడికి తట్టుకోలేక ఆ థర్మాకోల్‌ పూర్తిగా కొట్టుకపోయింది.

ఈ ప‌రిణామంలో మంత్రిపై విపక్షాలు ఆరోపణ‌లు గుప్పించాయి. కనీసం అవగాహాన లేకుండా ప్రజల సొమ్మును వృథా చేశారంటూ విప‌క్షాల నేత‌లు ఫైరయ్యారు. దీనిపై స్పంధించిన ఆ మంత్రి ఇది కేవలం ప్రయోగం మాత్రమేనని తనని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అన‌వ‌స‌రంగా రాద్దాంతం చేయ‌డం స‌రికాదంటూ త‌న చ‌ర్యను మంత్రి స‌పోర్ట్ చేస‌కున్నారు.

ఇదిలాఉండ‌గా...అన్నాడీఎంకే నేత టీటీవీ దినకరన్‌ ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ పోలీసుల ముందు హాజరయ్యాడు. రెండాకుల గుర్తు కోసం రూ.50 కోట్లు లంచం ఇవ్వజూపిన కేసులో దినకరన్‌ ను విచారించారు. వారం క్రితం సుఖేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తి.. రెండాకుల సింబల్ కోసం ఈసీ అధికారులకు లంచం ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ పట్టబడ్డాడు. దినకరన్ చెప్తేనే తాను లంచం ఇచ్చేందుకు వచ్చినట్లు సుఖేష్ వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో ఈ కేసులో విచారణకు హాజరుకావాల్సిందిగా దినకరన్ కు ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు సమన్లు జారీ చేయ‌గా ఇవాళ ఆయ‌న విచార‌ణ‌కు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా త‌న‌కు స‌ద‌రు బ్రోక‌ర్‌తో సంబంధం లేద‌ని దిన‌క‌ర‌న్ చెప్పిన‌ట్లు స‌మాచారం. విచార‌ణ అనంత‌రం మీడియాతో మాట్లాడ‌కుండానే దిన‌క‌ర‌న్ వెళ్లిపోయారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/