రెండు నెలల్లో టీడీపీ ఏపీలో ఖాళీనా?

Tue Jun 11 2019 10:25:15 GMT+0530 (IST)

రాబోయే రెండు నెలల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతుందా? ఆ పార్టీ నేతల్లో ఇప్పటికే కొందరు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే వారు బేరసారాలు మొదలుపెట్టినట్టుగా ఉన్నారు. ముందుగా రాయలసీమ ప్రాంతానికి చెందిన తెలుగుదేశం నేతలు బీజేపీకి టచ్లోకి వెళ్లినట్టుగా తెలుస్తోంది. బేరాలు తెగడం ఆలస్యం వాళ్లంతా మూకుమ్మడిగా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది.అయితే టీడీపీ టు బీజేపీ జర్నీ వారితో ఆగదు అని ఇంకా అనేక మంది నేతలు అదే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం. మరి కొంత సమయంలోనే చాలా మంది తెలుగుదేశం నేతలు కమలం పార్టీలోకి చేరడానికి రెడీ అవుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది.

ఈ జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. తెలుగుదేశం  పార్టీ తరఫున ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గిన వారిలో ఐదారు మంది మినహాయించి అందరూ బీజేపీలో చేరే ప్రయత్నంలోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. వ్యాపారాలు ఉన్న ప్రతి ఒక్కరూ కమలం పార్టీలోకే చేరిపోనున్నారని సమాచారం. ఈ చేరికలకు ఒక్కొక్కరుగా ముహూర్తాలు కూడా ఖరారు చేసుకుంటున్నారట. మత్తం వ్యవధి రెండు నెలలే అని - అంతలోనే మొత్తం కథ పూర్తి అవుతుందని భోగట్టా.

ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన వారు - ఓడిన వారు.. అందరూ జంపిగే అని మూకుమ్మడిగా వాళ్లు కమలం పార్టీలోకి చేరబోతున్నారని - రెండు నెలల్లో తెలుగుదేశం ఖాళీ అని పుకార్లు షికారు చేస్తూ ఉన్నాయి.