Begin typing your search above and press return to search.

రెండు సైకిల్ పార్టీలు సృష్టించిన రికార్డ్ ఇది

By:  Tupaki Desk   |   22 May 2018 3:58 PM GMT
రెండు సైకిల్ పార్టీలు సృష్టించిన రికార్డ్ ఇది
X
తెలుగుదేశం పార్టీకి ఒకే రోజు రెండు అనూహ్య‌మైన వార్త‌లు వినిపించాయి. ఒక‌టి త‌మ‌ది జాతీయ పార్టీ అని ప‌దే ప‌దే చెప్పుకునే టీడీపీని..ఓ ప్ర‌ముఖ సంస్థ ప్రాంతీయ పార్టీగానే లెక్కక‌ట్టేసింది. రెండో అంశం ఆ పార్టీ అనూహ్యమైన సంపాద‌న‌తో త‌న గల్లా పెట్టెను నింపేసుకుంటోంద‌ని స‌ద‌రు సంస్థ తేల్చింది. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే...దేశంలోని అన్నీ ప్రాంతీయ పార్టీలలో నంబ‌ర్ 2 స్థానాన్ని తెలుగుదేశం పార్టీ ద‌క్కించుకుంది. మొద‌టి స్థానాన్ని సైకిల్ గుర్తు గ‌ల మ‌రో పార్టీ అయిన సమాజ్ వాద్ పార్టీ కైవ‌సం చేసుకుంది.

అసోసియేష్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తాజాగా ఆయా పార్టీల వారీ ఆదాయంతో నివేదిక విడుద‌ల చేసింది. 2016-17 లో దేశంలోని 32 ప్రాంతీయపార్టీల మొత్తం ఆదాయం 321.03 కోట్లు ఉన్నట్లు ఈ రిపోర్ట్ తెలిపింది. ఇందులో అధికంగా ఎస్పీ(SP) రూ. 82.76 కోట్ల ఆదాయంతో మొదటిస్ధానంలో ఉండగా, రూ. 72.92 కోట్ల ఆదాయంతో తెలుగుదేశం పార్టీ రెండో స్థానంలో ఉంది. ఇక రూ.48.88 కోట్ల ఆదాయంతో మూడోస్ధానంలోఅన్నా డీఎంకే పార్టీ ఉంది. మెత్తం 32 ప్రాంతీయ పార్టీల ఆదాయం రూ.321.3 కోట్లు ఉండగా… ఈ మూడు ప్రాంతీయ పార్టీల ఆదాయం మెత్తం రూ. 204.56 కోట్లుగా ఉంది. అంటే మెత్తం 32 ప్రాంతీయ పార్టీలలో ఈ మూడు పార్టీల వాటా 63.72 శాతంగా ఉంది. 2015-16, 2016-17 మధ్య కాలంలో ప్రాంతీయ పార్టీలకు ఎక్కువగా డొనేషన్లు, గ్రాంట్స్, బ్యాంక్, ఫిక్సిడ్ డిపాజిట్ల రూపంలో ఆదాయం వచ్చినట్లు ఈ నివేదిక తెలిపింది. ఇక తమ ఆదాయంలో 87 శాతం పైగా ఇంకా ఖర్చు చేయలేదని ఎంఐఎం, జనతాదళ్ సెక్యూలర్ పార్టీలు తెలిపాయి. మరోవైపు తమ ఆదాయం కన్నా అధికంగా రూ. 81,88 కోట్లు ఖర్చు చేసినట్టు డీఎంకే పార్టీ తెలిపింది. కాగా, తమ ఆదాయంలో 67 శాతం ఇంకా ఖర్చు చేయలేదని టీడీపీ తెలిపింది.