Begin typing your search above and press return to search.

సెంటిమెంట్ డే :23.. టీడీపీకి చేదు.. వైసీపీకి తీపి..

By:  Tupaki Desk   |   24 May 2019 9:41 AM GMT
సెంటిమెంట్ డే :23.. టీడీపీకి చేదు.. వైసీపీకి తీపి..
X
మే 23.. టీడీపీ 23.. ఇది యాదృశ్చికంగా జరిగినా.. దీనివెనుక పేద్ద ఇంట్రస్టింగ్ స్టోరీనే ఉంది. ఈ 23ను వైసీపీ తమ తీపి జ్ఞాపకంగా భావిస్తుండగా.. ఇదే సమయంలో టీడీపీకి పీడకలగా 23 నిలిచిపోయిందని వైసీపీ అభిమానులు కథలు కథలుగా అనుభూతులు పంచుకుంటున్నారు.

2014 ఎన్నికల వేళ చంద్రబాబుకు భారీ మెజార్టీనే ప్రజలు కట్టబెట్టారు. టీడీపీ 102 సీట్లను గెలిస్తే.. వైసీపీ 67 స్థానాలను గెలుచుకుంది. కానీ ప్రతిపక్షాన్ని దెబ్బతీయాలని.. లేకుండా చేయాలని.. జగన్ ను మానసికంగా దెబ్బతీయడానిక చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి లాగేసుకున్నారు. ఉన్న 67మంది 23మంది ఎమ్మెల్యేలను, ఇద్దరు ఎంపీలను పార్టీ ఫిరాయించేశారు. అందులో నలుగురికి చంద్రబాబు ఏకంగా మంత్రి పదవులు ఇచ్చారు. అలా వైసీపీ నుంచి గెలిచిన 23 మంది ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు. పార్టీ ఫిరాయించిన ఎంపీల్లో కొత్త పల్లి గీత కనుమరుగు కాగా.. ఎస్పీవై రెడ్డి చనిపోయారు. బుట్టారేణుక చంద్రబాబు టికెట్ ఇవ్వకపోవడంతో దారుణంగా మోసపోయింది. ఇలా వైసీపీని వీడిన వారు ఈ రాజకీయాల్లో తీవ్రంగా నష్టపోయారు. జగన్ ను నమ్ముకొని ఉన్నవారు అఖండంగా గెలిచారు.

2019 ఎన్నికల వేళ 23వ నంబర్ మళ్లీ మ్యాజిక్ చేసింది. చంద్రబాబుకు ప్రజలు 23 మంది ఎమ్మెల్యేలనే ఇవ్వడం ఆశ్యర్యపరిచింది. అదీ మే 23వ తేదీన ఫలితాలు వెలువడడంతో ఈ తేదీపై అందరి దృష్టి నెలకొంది. ఇక వైసీపీకి 22 ఎంపీ సీట్లు వచ్చి ఆగిపోయాయి. ఒక్క సీటు అధికంగా వస్తే ఆ మ్యాజిక్ ఫిగర్ మరింత ప్రాధాన్యతను సంతరించుకునేది. ఇలా 23న 23కే పరిమితమైన బాబు పార్టీపై వైసీపీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు.