Begin typing your search above and press return to search.

మోడీ కంటే మహాజన్ నయం

By:  Tupaki Desk   |   30 Nov 2015 6:59 AM GMT
మోడీ కంటే మహాజన్ నయం
X
ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నుంచి ఏం కావాలన్నా ప్రధాని మోడీనో... లేదంటే ఆయా శాఖల మంత్రులనో అడుగుతూ వస్తున్నారు ఇంతవరకు. కానీ... కేంద్రం ఎంతాగా పక్షపాతం చూపిస్తుందన్నది పదేపదే అర్తమవుతుండడం... తాజాగా మొన్నటి వర్షాల సమయంలో మోడీ అనుసరించిన తీరుచూసి రాష్ట్రమంతా నివ్వెర పోయింది. ఏపీలో వర్షాలకు నానా ఇబ్బందులు పడి తీవ్రంగా నష్టపోయిన రాయలసీమ - నెల్లూరు - ఉభయగోదావరి జిల్లాలకు రూ.వెయ్యి కోట్లు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా లేఖరాస్తే కేంద్రం ఏమాత్రం స్పందించలేదు. పైగా రాష్ట్రం వద్ద ఉన్న నిధులు తొలుత వినియోగించాలని కేంద్ర మంత్రి వెంకయ్య సూచించారు. బీజేపీ తరఫున కోటి రూపాయల విరాళం ప్రకటించారు. అదేసమయంలో వర్షాలకు దెబ్బతిన్న చెన్నై నగరాన్ని ఆదుకునేందుకు రూ.2 వేల కోట్లు కావాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత లేఖ రాస్తే... ఆ లేఖ అందింన గంట వ్యవధిలోనే ప్రధాని మోడీ విదేశాల్లో ఉన్నా అక్కడి నుంచే తక్షణం వెయ్యి కోట్లు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ పరిణామాలు ప్రజలనే కాదు, పొలిటీషియన్లనూ బాధించాయి. దీంతో ఈసారి పార్లమెంటులోనే దీనిపై తేల్చుకోవాలని టీడీపీ ఎంపీలు భావించారు. అందులో భాగంగానే వారు సోమవారం పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాగానే నేరుగా స్పీకరు దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లారు.

ఏపీలోని పలు జిల్లాలను వర్షం అతలాకుతలం చేస్తే కేంద్రం ఏమాత్రం సాయం చేయలేదని ఆరోపిస్తూ... దీనిపై వెంటనే చర్చకు అవకాశం ఇవ్వాలని కోరుతూ టీడీపీ ఎంపీలు స్పీకర్ సుమిత్ర మహాజన్ కు నోటీసులు ఇచ్చారు. రాష్ట్రంలో పరిస్థితిని వారు స్పీకరుకు వివరించారు.