Begin typing your search above and press return to search.

భ‌ద్ర‌త‌పై గ‌గ్గోలు ఆప‌రా త‌మ్ముళ్లు?

By:  Tupaki Desk   |   15 Jun 2019 11:26 AM GMT
భ‌ద్ర‌త‌పై గ‌గ్గోలు ఆప‌రా త‌మ్ముళ్లు?
X
టీడీపీ అధినేత‌.. ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చేతి నుంచి అధికారం చేజార‌టం ఏమో కానీ.. ఈ య‌వ్వారంలో పోలీసులు తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. ఇది ఈసారే కాదు.. బాబు చేతిలో ప‌వ‌ర్ పోయిన ప్ర‌తిసారీ అదో గోల‌. 2004లో ప‌వ‌ర్ చేజారిన త‌ర్వాత‌.. అయిన దానికి కాని దానికి ఏదోలా భ‌ద్ర‌త పేరు చెప్పి త‌మ్ముళ్లు హ‌డావుడి చేయ‌టం మామూలే. ఇంత హ‌డావుడి చేస్తున్న త‌మ్ముళ్లు.. 2014ఎన్నిక‌ల్లో ఓడిన విప‌క్ష నేత‌ల‌కు ఇచ్చిన భ‌ద్ర‌త మాటేమిటి?

అలా అని.. బాబుకు భ‌ద్ర‌త‌ను కుదించారా అంటే.. అదీ లేదు. కేవ‌లం ప్రోటోకాల్ ప్ర‌కారం తీసేయాల్సిన ఒక‌ట్రెండు వాహ‌నాలు త‌ప్పించి.. మిగిలిన‌దంతా య‌థాత‌ధంగా కొన‌సాగిస్తున్న‌దే. అయిన‌ప్ప‌టికీ.. కొంప‌లు మునిగిపోయిన‌ట్లుగా బాబు భ‌ద్ర‌త‌పై సందేహాలు వ్య‌క్తం చేయ‌టం త‌మ్ముళ్ల‌కు అల‌వాటే. నిత్యం బాబు చుట్టూ ఓ పాతిక మంది సిబ్బంది ఉంటే త‌ప్పించి సంతృప్తి ఉండ‌దు బాబుకు.

తాజాగా విప‌క్ష నేత‌కు ఎలాంటి భ‌ద్ర‌త ఉండాలో.. అంత భ‌ద్ర‌త‌ను స‌మీక్షించి మ‌రీ ఏర్పాటు చేసినా.. త‌మ్ముళ్లు మాత్రం గ‌గ్గోలు పెట్టేస్తున్నారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత బాబుకు ఇచ్చే భ‌ద్ర‌త‌ను కుదించిన‌ట్లుగా ఆరోపిస్తున్నారు. ప‌వ‌ర్ చేతిలో లేని వేళ‌.. అధికారం ఉన్న‌ప్ప‌టి మాదిరి కుద‌ర‌దు క‌దా? ఆ వాస్త‌వాన్ని బాబు అండ్ కో ఎందుకు అర్థం చేసుకోరో అర్థం కాదు.

బాబు భ‌ద్ర‌త విష‌యంలో పోలీసులు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న‌ట్లు ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్న వేళ‌.. పోలీసులు తాజాగా ఒక క్లారిటీ ఇచ్చారు.తాము బాబుకు ఎలాంటి భ‌ద్ర‌త‌ను కుదించ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. ప్రోటోకాల్ ప్ర‌కారం కాన్వాయ్ లోని అడ్వాన్స్ పైల‌ట్ కారును మాత్ర‌మే తొల‌గించామ‌ని..అంత‌కు మించి మ‌రేలాంటి మార్పులు చేయ‌లేద‌ని పేర్కొన్నారు.

రోడ్డు క్లియ‌ర్స‌న్ విష‌యంలోనూ ఎలాంటి మార్పులు లేవ‌ని.. ఎప్ప‌టి మాదిరే కొన‌సాగుతుంద‌న్నారు. బాబుకు భ‌ద్ర‌త‌ను కుదించిన‌ట్లుగా తెలుగు త‌మ్ముళ్లు చేస్తున్న ఆరోప‌ణ‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. విప‌క్ష నేత అయిన వెంట‌నే.. భ‌ద్ర‌త మీద హాడావుడి చేయ‌టం మామూలేన‌ని గ‌తాన్ని గుర్తుకు తెస్తున్నారు. బాబు భ‌ద్ర‌త మీద అన‌వ‌స‌ర‌మైన గ‌గ్గోలు ఎందుకంటే.. సానుభూతి కోస‌మ‌ని తెలుగు త‌మ్ముళ్లు లోగుట్టుగా చెబుతున్న మాట విన్న‌ప్పుడు ఈ భ‌ద్ర‌తా గ‌గ్గోలును ఇక ఆప‌రా త‌మ్ముళ్లు? అన్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.