సాదినేని యామినికి దిష్టి తగిలిందా.?

Mon Mar 25 2019 23:29:56 GMT+0530 (IST)

టీడీపీలో ఫేస్ వేల్యూ ఉన్నవాళ్లు చాలా మంది ఉన్నారు. ఒకవేళ లేకపోయినా రోజుకి పదిసార్లు మీడియాకు ముందుకు రావడం - ప్రెస్ మీట్ పెట్టడం లాంటివి చేస్తే ఎవ్వరైనా పార్టీలో సీనియర్ అయిపోవచ్చు. అయితే.. రీసెంట్గా టీడీపీలో బాగా పాపులర్ అయిన నాయకురాలు యామిని సాధినేని. పవన్ కల్యాణ్ ని మల్లెపూలు అని విమర్శించిన యామిని ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. టీవీ స్క్రీన్ కు కూడా అందంగా ఉండడంతో.. మీడియా వాళ్లు కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో టీడీపీలో మహిళా నేత అంటే.. అందరికి గుర్తొచ్చే పేరు యామినీ శర్మే.అయితే.. యామినీకి రోజురోజుకి పేరు ఎక్కువ వస్తుండడంతో ఆమెకు దిష్టి తగిలిందా. చూస్తుంటే అలాగే కన్పిస్తుంది. రీసెంట్ గా టీడీపీ స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ రిలీజ్ చేశారు చంద్రబాబు. ఇందులో అందరు ఉన్నారు కానీ యామిని పేరు కన్పించలేదు. కారణం.. రెండు వారం రోజుల క్రితం జరిగిన సంఘటనే అంటున్నాయి టీడీపీ వర్గాలు. తన కులపోళ్లతో చంద్రబాబు ఇంటి దగ్గర గొడవచెయ్యమని.. అప్పుడు చంద్రబాబు నాయుడు తనకు కూడా ఏదో ఒక నియోజకవర్గం నుంచి సీటు ఇస్తారనే ఒక ఆడియో టేప్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అది తనది కాదని యామిని చెప్తోంది. ఈ విషయం పక్కనపెడితే.. ఆడియో టేప్ వ్యవహారంలో యామినిపై బిగ్ బాస్ బాబు సీరియస్ గా ఉన్నారట. అందుకే స్టార్ క్యాంపెయిన్ లిస్ట్ లో పేరు పెట్టకుండా దూరం పెట్టారని సమాచారం.