Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ దుమ్ము దులిపేసిన జూపూడి!

By:  Tupaki Desk   |   15 Aug 2018 4:48 AM GMT
ప‌వ‌న్ దుమ్ము దులిపేసిన జూపూడి!
X
గ‌డిచిన కొంత‌కాలంగా పెద్ద‌గా వార్త‌ల్లో క‌నిపించ‌ని ఏపీ టీడీపీ నేత‌.. ఎస్సీ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ జూపూడి ప్ర‌భాక‌ర్ తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ఉద్దేశించి ఆయ‌న తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ప‌వ‌న్ సోద‌రుడు చిరంజీవిని.. ఆయ‌న అప్ప‌ట్లో పెట్టిన ప్ర‌జారాజ్యంపై ప‌లు విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌లు చేశారు.

ఇప్పుడు చిరంజీవి ఏ పార్టీలో ఉన్నారో ఎవ‌రికీ అర్థం కావ‌టం లేద‌న్న ఆయ‌న‌.. విభ‌జ‌న స‌మ‌యంలో చిరంజీవి ఏం మాట్లాడ‌లేదు? ఎందుక‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌జారాజ్యం యూత్ విభాగానికి నాయ‌క‌త్వం వ‌హించిన ప‌వ‌న్.. పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తుంటే ఎందుకు మాట్లాడ‌లేదో చెప్పాల‌న్నారు. చిరంజీవిపై విమ‌ర్శ‌నాస్త్రాల్ని సంధిస్తూనే.. ఆయ‌న బావ‌మ‌రిది అల్లు అర‌వింద్ పై తీవ్ర‌వ్యాఖ్య‌లు చేశారు.

2009 ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల నుంచి స్థ‌లాలు.. పొలాలు.. ఇళ్లు రాయించుకొని రాజ‌కీయాల్ని కలుషితం చేశార‌ని మండిప‌డ్డారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏం మాట్లాడ‌తారో ఎవ‌రికీ అర్థం కాద‌న్న ఆయ‌న‌.. ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడ‌తార‌ని గుర్తు చేశారు. త‌న‌కు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉంటే అసెంబ్లీని వ‌ణికించేవాడిన‌ని చెబుతారంటూ ఎద్దేవా చేసిన జూపూడి.. ప‌వ‌న్ అన్న చిరంజీవికి 18 ఎమ్మెల్యేలు ఉన్నార‌ని.. అప్పుడేం చేశార‌ని ప్ర‌శ్నించారు.

ఐదుగురు ఎమ్మెల్యేల‌తో ప‌వ‌న్ సీఎం కావాల‌ని అనుకుంటున్నారా? అన్న జూపూడి.. పొంత‌న‌లేని మాట‌లు మాట్లాడుతున్నార‌న్నారు. ప్ర‌జారాజ్యం అవ‌శేషంగా జ‌న‌సేన‌ను ప్ర‌జ‌లు భావిస్తున్నార‌ని మండిప‌డ్డారు. ప‌వ‌న్ కు ద‌గ్గ‌ర‌గా ఉన్న‌లోక్ స‌త్తా జేపీ.. వామ‌ప‌క్ష నేత‌లు ఒక్కొక్క‌రూ ఆయ‌న్ను వ‌దిలేశార‌న్నారు.

మొద‌ట్లో కుల‌మ‌తాలు లేవ‌న్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఇప్పుడు కాపు కులం అయినందునే త‌న‌ను చంద్ర‌బాబు గౌర‌వించ‌టం లేద‌ని చెప్ప‌టం కామెడీగా అభివ‌ర్ణించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ రంగు బ‌య‌ట‌ప‌డుతుంద‌ని.. ఆయ‌న‌కు ప్ర‌జ‌లు గ‌ట్టిగా బుద్ధి చెబుతార‌న్నారు.

ప‌వ‌న్ ద్వంద విధానం గురించి మాట్లాడుతున్న జూపూడి స‌మైక్యాంధ్ర విష‌యంలో జ‌గ‌న్ సింగిల్ స్టాండ్‌పై ఉన్న‌పుడు దానికి మ‌ద్ద‌తు ప‌ల‌కకుండా రెండు క‌ళ్లు, రెండు కొబ్బ‌రికాయ‌ల సిద్ధాంతంతో జ‌నాల్ని, మీడియాను మాయ చేసిన బాబు గురించి చాలా చ‌క్క‌గా మ‌రిచిపోయారు పాపం. ఇంకో విష‌యం... పాపం వైజాగ్‌లో మీ నేత‌ల కబ్జాలు, అమ‌రావ‌తి భూ పందేరాలు ఎలా మ‌రిచిపోయార‌బ్బా జూపూడి.?

విచిత్ర‌మైన విష‌యం ఏంటంటే... తెలుగుదేశం 2014 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఇంకా స‌గానికి స‌గం వ‌దిలేసి ఏ మాత్రం బెరుకు జంకు లేకుండా య‌న‌మ‌ల ఇత‌రుల మేనిఫెస్టోల గురించి మాట్లాడ‌ట‌మే విడ్డూరం. అయినా రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు సంబంధం లేని అంశాల‌ను మేనిఫెస్టోలో పెట్టి ప‌వ‌న్ న‌వ్వుల పాల‌యితే... తాము అమ‌లే చేయ‌కుండా ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టిన వారు త‌మను కాపీ కొట్టార‌న‌డం ఇంకో కామెడీ.