Begin typing your search above and press return to search.

మనోళ్లు ఎలా ఉండాలో చెప్పిన ‘తానా’

By:  Tupaki Desk   |   26 Feb 2017 4:56 AM GMT
మనోళ్లు ఎలా ఉండాలో చెప్పిన ‘తానా’
X
అమెరికాలో నేరాలేం కొత్త కాదు. అక్కడి గన్ కల్చర్ తక్కువేం కాదు. మనకంటే కూడా అమెరికాలో రక్షణ తక్కువ. పేరుకు అగ్రరాజ్యమే అయినా.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉండాల్సిందే. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఫర్లేదు కానీ.. జనాలు పల్చగా ఉండే ప్రాంతాల్లో పరిస్థితి ఏ మాత్రం క్షేమకరం కానే కాదు. ఈ విషయాలేవీ కొత్త కాకున్నా.. ట్రంప్ దేశాధ్యక్షుడు అయిన నాటి నుంచి పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యాయి. అతి వాదుల మనసుల్లో విద్వేషం రోజురోజుకీ పెరిగిపోతోంది. ప్రాంతీయ ఆలోచనలకు విద్వేషం తోడు కావటంతో.. ఎప్పుడు ఎవరు ఎట్లా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. దీంతో.. అమెరికాలో ఉన్న లక్షలాది తెలుగువారికి సరికొత్త ముప్పు ఇప్పుడు తెరపైకి వచ్చింది.

జాతి విద్వేషంతో.. కాల్పులు జరిపిన దుండగుడి కారణంగా ప్రాణాలు కోల్పోయిన కూఛిబొట్ల శ్రీనివాస్ ఉదంతం నేపథ్యంలో..ఉత్తర అమెరికా తెలుగు సంఘం ప్రతినిధులు అమెరికాలోని తెలుగువారికి సరికొత్త సూచనలు జారీ చేశారు. ట్రంప్ సర్కారు కారణంగా దేశంలో ఉంటున్నవిదేశీయులకు ఆందోళన సహజమేనని.. జాతి విద్వేషం కారణంగాకాల్పులు జరుపుతారన్నభయం ఉంటుందని.. ఈ నేపథ్యంలో మన జాగ్రత్తలో మనం ఉందామని తాజా వెల్లడించింది.

అమెరికాలో ఉన్న తెలుగు వారు ఎలా వ్యవహరిస్తే మంచిదన్న అంశంపై కొన్ని సూచనలు చేస్తున్నారు. తానాతో పాటు.. మరికొందరు తెలుగుప్రముఖులు చెబుతున్న సలహాలు.. సూచనలు చూస్తే..

= విదేశీయులతో గొడవ పడొద్దు.

= ఎవరైనా గొడవ పెట్టుకుంటు.. వెంటనే అక్కడి నుంచి వెంటనే వెళ్లిపొండి

= నలుగురిలో ఉన్నప్పుడు మాతృ భాషలోనో.. హిందీలోనో మాట్లాడుకోవద్దు. దీని వల్ల వారేదోమాట్లాడుకుంటున్నారన్న భావన కలిగే ప్రమాదం ఉంది.

= రాత్రి వేళ పార్టీలకు.. కార్యక్రమాలకు వెళ్లొద్దు.

= జనసంచారం తక్కువగా ఉన్న ప్రాంతాల్లోకి అసలు వెళ్లొద్దు.

= సాయంత్రం వేళ వీలైనంత త్వరగా ఇంటికి చేరుకోండి

= ఆసియా నుంచి వచ్చిన వారి పట్ల అమెరికన్లు ద్వేష భావంతో ఉన్నారు. అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి.

= రాత్రివేళల్లో రెస్టారెంట్లలో భోజనం చేసేటప్పుడు అమెరికన్లు రెచ్చగొట్టేలా మాట్లాడితే రియాక్ట్ కావొద్దు.

= రాత్రి వేళ ఒంటరిగా తిరిగే పని పెట్టుకోవద్దు.

= అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి.

=అనుకోని రీతిలో ఏదైనా గొడవ చోటు చేసుకున్నా.. అక్కడ నుంచి వెంటనే వెళ్లిపోండి.

= పరిసరాల్ని గమనిస్తూ ఉండండి. ఏదైనాఅనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి.

= జనసందోహం తక్కువగా ఉండే ప్రాంతాల్లో దాడుల ముప్పు ఎక్కువ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/