Begin typing your search above and press return to search.

ఇలాంటి క‌లెక్ట‌ర్ల‌కు సెల్యూట్ చేయాల్సిందే!

By:  Tupaki Desk   |   22 April 2019 5:31 AM GMT
ఇలాంటి క‌లెక్ట‌ర్ల‌కు సెల్యూట్ చేయాల్సిందే!
X
చేతిలో అధికార దండం ఉంటే చాలు.. తామేదో ఆకాశం నుంచి ఊడిప‌డిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే ధోర‌ణి చాలామందిలో క‌నిపిస్తూ ఉంటుంది. అందుకు భిన్నంగా సింఫుల్ గా ఉంటూ ప‌నిని ప్రేమించ‌టం.. విలువ‌ల్ని కాపాడే అధికారులు చాలా కొద్దిమందే ఉంటారు. ఇలాంటి వారికి సంబంధించిన చాలా విష‌యాలు బ‌య‌ట‌కు రాకుండా పోతుంటాయి.

సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని.. అలాంటి ఒక క‌లెక్ట‌ర్మ గురించి తెలుసుకునే అవ‌కాశం అంద‌రికి వ‌చ్చింద‌ని చెప్పాలి. జిల్లా క‌లెక్ట‌ర్ అంటే ఆ రాజ‌సం.. ఆ హ‌డావుడి ఒక రేంజ్లో ఉంటాయి. కానీ.. అందుకు భిన్నంగా రోడ్ల మీద తిర‌గ‌టం.. స‌గ‌టు ఉద్యోగి మాదిరి బ‌రువైన ట్రంక్ పెట్టెల్ని మోసే క‌లెక్ట‌ర్ ను ఎప్పుడైనా.. ఎక్క‌డైనా చూశారా?

క‌చ్ఛితంగా చూసి ఉండ‌ర‌నే మాటే మీ నోటి నుంచి రావ‌టం ఖాయం. కానీ.. అందుకు భిన్నంగా అధికార ద‌ర్పం అన్న‌ది లేకుండా.. సిబ్బందితో క‌లిసిపోయి ప‌ని చేసే క‌లెక్ట‌ర‌మ్మ ఉదంతం ఇప్పుడు వార్తాంశంగా మారింది. కేర‌ళ‌లోని త్రిస్సూర్ క‌లెక్ట‌ర్ టీవీ అనుప‌మ చాలా భిన్న‌మైన ఐఏఎస్ అధికారిణి. ద‌ర్పం అన్న‌ది ఆమెలో పిస‌రంత అయినా క‌నిపించ‌ద‌ని చెబుతుంటారు.

తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల పోలింగ్ సంద‌ర్భంగా ఎన్నిక‌ల సామాగ్రి ఉన్న బ‌రువైన ట్రంక్ పెట్టెల్ని లారీ నుంచి దించి కార్యాల‌యంలోకి తీసుకెళ్లిన వైనం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. క‌లెక్ట‌ర్మ చేసిన ప‌నికి సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున అభినంద‌న‌లు వెల్లువెత్తున్నాయి. ప్ర‌తి ఒక్క అధికారికి ఆమె ఆద‌ర్శ‌మ‌న్న కామెంట్లు వ‌స్తున్నాయి. నిజానికి అనుప‌మ లాంటి క‌లెక్ట‌రమ్మ కానీ తెలంగాణ ప్ర‌భుత్వంలో ఉండి.. ఇప్పుడు వైర‌ల్ అయిన‌ట్లుగా వీడియో వైర‌ల్ అయితే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి పెద్దఎత్తున గుర్తింపు ల‌భిస్తుంద‌న్న మాట కొంద‌రి నోట రావ‌టం గ‌మ‌నార్హం.