Begin typing your search above and press return to search.

అక్క‌డ ప‌ని మ‌ధ్య సెక్స్ బ్రేక్ ఇస్తార‌ట‌

By:  Tupaki Desk   |   22 Feb 2017 12:40 PM GMT
అక్క‌డ ప‌ని మ‌ధ్య సెక్స్ బ్రేక్ ఇస్తార‌ట‌
X
ప‌ని మ‌ధ్య‌లో బ్రేక్ తీసుకొని ఓ చాయ్ తాగితేనో తేదా ఓ ద‌మ్ముకొడితేనే పొందే రిలాక్సే వేరు క‌దా. కానీ అలాంటి పాత విధానాలు కాకుండా సెక్స్ బ్రేక్ వంటివి ఇస్తే!! వావ్ ఇలాంటివి కూడా ఉంటాయా? ఎక్క‌డ ఇలాంటి ప్ర‌తిపాద‌న వ‌చ్చింది అని అనుకుంటున్నారు కాదు. స‌్వీడ‌న్‌ లో ఈ క్రేజీ ప్ర‌తిపాద‌న వ‌చ్చింది. ఓ టౌన్ కౌన్సిల‌ర్ ఓ వినూత్న ప్ర‌తిపాద‌న‌ను ముందుకు తీసుకొచ్చారు. ఉద్యోగాలు చేసుకునేవాళ్లు ప‌ని మ‌ధ్య‌లో గంట బ్రేక్ తీసుకొని...ఇంటికెళ్లి త‌మ పార్ట్‌ న‌ర్స్‌తో సెక్స్ చేసి వ‌చ్చేందుకు అనుమ‌తి ఇవ్వాల‌న్న‌ది ఆ ప్ర‌తిపాద‌న‌. ప‌ని ఒత్తిడి వ‌ల్ల దంప‌తులు స‌రిగా సెక్స్‌ లో పాల్గొన‌డం లేద‌న్న‌ది ఆ కౌన్సిల‌ర్ అభిప్రాయం.

స్వీడ‌న్‌ లోని ఒవెర్టోనియా టౌన్ కౌన్సిల‌ర్ పెర్ ఎరిక్ ముస్కోస్ ఈ ప్ర‌తిపాద‌న‌ను తీసుకొచ్చారు. సెక్స్ ఆరోగ్యానికి మంచిద‌ని అధ్య‌య‌నాలు నిరూపించాయ‌ని ఈ సంద‌ర్భంగా ముస్కోస్ అన్నారు. ప‌ని మ‌ధ్య‌లో ఇలాంటి బ్రేక్స్ ఇవ్వ‌డం వ‌ల్ల ఉద్యోగులు మరింత ఉత్సాహంగా ప‌నిచేయ‌డంతోపాటు...వ్య‌క్తిగత జీవితంలో కూడా వారి బంధాలు మ‌రింత బ‌ల‌ప‌డ‌తాయ‌ని ముస్కోస్ వాదిస్తున్నారు. అయితే ఈ బ్రేక్‌లో క‌చ్చితంగా ఉద్యోగి ఇంటికెళ్లి సెక్స్ చేస్తాడ‌ని చెప్ప‌లేమ‌ని, ఈ స‌మ‌యాన్ని వేరే ప‌నికి కూడా కేటాయించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఆయ‌న అన్నారు. ఈ బిల్లు పాస్ అవుతుంద‌న‌డంలో త‌న‌కు ఎలాంటి సందేహం లేద‌ని ముస్కోస్ స్ప‌ష్టంచేశారు. ఇప్ప‌టికే యూరప్‌లో అతి త‌క్కువ గంట‌లు ప‌నిచేసిన ఉద్యోగ‌స్తుల్లో స్వీడ‌న్ మూడోస్థానంలో ఉంది. 2015లో ఆ దేశంలోని ఫుల్ ఉద్యోగులు స‌గ‌టున 1685 గంట‌లు మాత్ర‌మే ప‌నిచేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/