Begin typing your search above and press return to search.

మ్యూజిక్ షోలో రేప్ చేసినంత పని చేశారు

By:  Tupaki Desk   |   25 July 2016 7:18 AM GMT
మ్యూజిక్ షోలో రేప్ చేసినంత పని చేశారు
X
మొన్నటి వరకూ ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించిన యూరప్ లో ఇప్పుడు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది జనవరి 1 సందర్భంగా జరిగిన వేడుకల్లో పాల్గొనేందుకు వీధుల్లోకి వచ్చిన పలువురు మహిళల్ని వ్యూహాత్మకంగా రోడ్ల మీదనే రేప్ చేయటం తెలిసిందే. పెద్ద సమూహంగా ఉండే గుంపులోకి మహిళల్ని తీసుకెళ్లిపోయి.. వారి మధ్యనే రేప్ చేసే దారుణాల దగ్గర నుంచి.. ఎప్పుడు ఎక్కడ పేలతాయో తెలీని బాంబులతో సగటు యూరోపియన్లు వణికిపోతున్న పరిస్థితి.

తాజాగా స్వీడన్ లో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకుంది. అక్కడి స్కుల్లెఫ్టీలో ట్రాస్టాక్ ఫెస్టివల్ పేరిట పెద్ద మ్యూజిక్ ఫెస్టివల్ జరిగింది. ఈ సందర్భంగా వందలాది మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే స్కర్ట్ వేసుకొని వచ్చిన మహిళలతో పాటు.. మరికొందరి పట్ల అనుచితంగా వ్యవహరించటంతో పాటు.. లైంగిక దాడులకు పాల్పడటం సంచలనంగా మారింది.

కాన్సర్ట్ జరుగుతున్న సమయంలో కొందరు వ్యక్తులు మహిళలపై దాడులకు దిగటం.. స్కర్ట్ వేసుకున్న మహిళలతో అసభ్యంగా వ్యవహరించటంతోపాటు.. వారి పట్ల అనుచితంగా ప్రవర్తించటం.. తాకరాని చోట్ల తాకటం లాంటివి చేశారు. దాదాపు పన్నెండు మందికి పైగా మహిళలకు ఈ తరహా దారుణ పరిస్థితి ఎదురైంది. మహిళలతో సభ్యతతో వ్యవహరించాలని.. లైంగిక దాడులకు పాల్పడకూడదంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసినా.. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.