Begin typing your search above and press return to search.

పాక్ ని ఆడుకున్న సుష్మా, ముంబై యూత్!

By:  Tupaki Desk   |   26 Sep 2016 4:59 PM GMT
పాక్ ని ఆడుకున్న సుష్మా, ముంబై యూత్!
X
ఇప్పటివరకూ ఒకెత్తు, ఇకపై ఒకెత్తు అనుకుంటున్నాఅరో ఏమో కానీ... యురి ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ పై భారతీయులంతా ఒక్కొక్కరుగా నిప్పులు కురిపిస్తున్నారు. ఆ దాడి అనంతరం పాక్ వైఖరిని ప్రపంచ దేశాలు ఇప్పటికే తప్పుపట్టగా, ఐకాసా వేదికగా భారత్ కూడా కడిగి పారేసింది. ఇదే క్రమంలో తాజాగా మరోసారి సుష్మా స్వరాజ్ ఐరాసా వేదికగా పాక్ పై నిప్పులు కురిపిస్తే... ఇండియాలో ముంబై యూత్ ఏకంగా పాక్ ఉత్పత్తుల అమ్మకాలపై నిషేధానికి డిమాండ్ చేసింది.

ఈ నెల 21న ఐక్యరాజ్య సమితి నుంచి భారత్‌ పై తీవ్ర విమర్శలు చేసిన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌‌‌ కు మరోసారి దిమ్మతిరిగేలా సమాధానమిచ్చారు కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్. కాబూల్, బ్యాంకాక్, ఢాకా, పఠాన్‌కోట్, యూరీ‌తో పాటు సిరియా, ఇరాక్‌ లలో నిరంతరం జరుగుతున్న ఉగ్రవాద మారణహోమాన్ని అడ్డుకోవడంలో ఐరాసా విఫలమైందని ఆవేదన వ్యక్తం చేస్తూ మొదలుపెట్టిన సుష్మా... ఉగ్రవాదుల్ని ఎగుమతి చేస్తోంది పాకిస్తానే అని నిప్పులు చెరుగుతూ... జమ్ము కాశ్మీర్ భారత అంతర్భాగమని, దీనిపై పాకిస్థాన్ కలలు కనడం మానుకోవాలని హెచ్చరించారు. నిత్యం శాంతి కోరుకునే భారత్, పాక్ కి స్నేహ హస్తం అందిస్తే వారు మాత్రం పఠాన్‌కోట్, యూరీలను కానుకలుగా ఇచ్చరాని ప్రపంచవేదికపై పాక్ ను కడిగేశారు.

ఇక భారత వాణిజ్య రాజధాని ముంబైలో పాకిస్థాన్ వ్యతిరేక ఆందోళన ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా పాకిస్థాన్ ఉత్పత్తుల అమ్మకాలను నిషేధించాలంటూ ముంబై యూత్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఉరీలో ఉగ్రవాదుల జరిపిన దాడిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా మార్కెట్లలో ఉన్న పాకిస్థాన్ ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేయాలంటూ ఈ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రదీప్ భవ్నానీ ఒక ప్రకటనలో తెలిపారు. పాకిస్థాన్ చర్యలను వ్యతిరేకిస్తూ ముంబై సహా దేశంలోని అన్ని నగరాల్లోని షాపింగ్ మాల్స్, షాప్స్ నుంచి పాకిస్థాన్ ఉత్పత్తులను తక్షణం తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.