Begin typing your search above and press return to search.

చిన్న‌మ్మ ఆన్స‌ర్ అదిరిపోయిందిగా!

By:  Tupaki Desk   |   9 Aug 2018 7:47 AM GMT
చిన్న‌మ్మ ఆన్స‌ర్ అదిరిపోయిందిగా!
X
అవ‌కాశం ఉండాలే కానీ.. దేన్నైనా వాడేసే తీరు మ‌నోళ్ల‌కు కాస్త ఎక్కువే. త‌మ స‌మ‌స్య‌లు మాత్ర‌మే త‌మ‌కు ముఖ్యం త‌ప్ప తాము అడిగే ప్ర‌శ్న‌లో అర్థం ఎంత‌? తాము ఏ స్థాయి వారిని ఎలాంటి ప్ర‌శ్న అడుగుతున్నామ‌న్న కామ‌న్ సెన్స్ కూడా లేకుండా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. ఇలాంటి తిక్క ప్ర‌శ్న‌ల్ని స్పోర్టివ్ గా తీసుకొని.. ఫ‌న్నీగా స్పందించే తీరుకు మ‌న నేత‌ల్ని మెచ్చుకోవాలి.

కేంద్ర విదేశాంగ మంత్రిని అడ‌గాల్సిన ప్ర‌శ్న ఏమిట‌న్న చిన్న విష‌యాన్ని మ‌ర్చిపోయి నెటిజ‌న్ ఒక‌రు అడిగిన ప్ర‌శ్న‌కు చిన్న‌మ్మ అలియాస్ సుష్మా స్వ‌రాజ్ ఫ‌న్నీగా బ‌దులిచ్చారు. బాలీకి వెళ్ల‌టం సుర‌క్షిత‌మేనా?.. మేం ఆగ‌స్టు 11 నుంచి 17 మ‌ధ్య ప‌ర్య‌టించాల‌ని అనుకుంటున్నాం.. ప్ర‌భుత్వం ఏమైనా మార్గ‌ద‌ర్శ‌కాల్ని జారీ చేసిందా? ద‌య‌చేసి మాకు స‌ల‌హా ఇవ్వండి అంటూ అడిగారు. నిజానికి ఇలాంటి సందేహానికి స‌మాధానం కోసం గూగుల్ లేదంటే.. టూర్ ఆప‌రేట‌ర్ ను అడిగితే స‌రిపోతుంది.

అయితే.. స‌ద‌రు నెటిజ‌న్ మాత్రం ఏకంగా విదేశాంగ మంత్రిని అడిగేశారు. నెటిజ‌న్ ప్ర‌శ్న‌కు సూటిగా స‌మాధానం ఇవ్వ‌ని సుష్మా.. త‌న‌దైన శైలిలో ఫ‌న్నీగా ఆన్స‌ర్ ఇచ్చారు. అక్క‌డి అగ్నిపర్వ‌తాన్ని సంప్ర‌దించి మీకు చెబుతానంటూ బ‌దులిచ్చారు. ఆమె టైమింగ్ పై ప‌లువురు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఆ మ‌ధ్య‌న‌ కొద్ది రోజులు ఇండోనేషియాలోని బాలీ ద్వీపంలో అగుంగ్ అగ్నిప‌ర్వతం యాక్టివ్ గా ఉంది. ఈ కార‌ణంతో అగ్నిప‌ర్వ‌తం ఉంచి లావా బూడిద పెద్ద ఎత్తున వెలువ‌డ‌టంతో ఎయిర్ పోర్ట్ ను మూసేశారు. విమాన రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు విధించారు. ప్ర‌స్తుతం అలాంటి ప‌రిస్థితి పెద్ద‌గా లేకున్నా.. అప్పుడ‌ప్పుడు భూకంపాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ స‌మాచారం కోసం ఇండోనేషియా స్థానిక మీడియా వార్త‌ల్ని ప‌రిశీలిస్తే స‌రిపోయేది.