Begin typing your search above and press return to search.

షాకింగ్ సర్వే:వచ్చే ఎన్నికల్లో బాబు పార్టీకి 12 సీట్లే

By:  Tupaki Desk   |   18 Jan 2018 5:16 PM GMT
షాకింగ్ సర్వే:వచ్చే ఎన్నికల్లో బాబు పార్టీకి 12 సీట్లే
X
వైసీపీ ఎమ్మెల్యేలను కొనేస్తున్నా... ఏదోరకంగా మమ అనిపిస్తూ నాసిరకం పనులతో పలు పనులు పూర్తి చేస్తున్నా జనంలో మాత్రం చంద్రబాబుకు ఆదరణ ఏమాత్రం పెరగడం లేదట. అంతేకాదు... ఎలాగైనా 2019లో మళ్లీ అధికారంలోకి రావాలని చంద్రబాబుకు ఉన్న వాంఛ కూడా తీరేలా లేదని జాతీయ వార్తా చానల్ రిపబ్లికన్ టీవీ స్పష్టం చేసింది. వచ్చే ఎన్నికల్లో ఆయన గెలుపు అసాధ్యమని తేల్చి చెప్పింది. ఇప్పటికిప్పుడు లోక్‌ సభ ఎన్నికలు జరిగితే టీడీపీ-బీజేపీ కూటమి కంటే వైసీపీనే ఎక్కువ స్థానాలు సొంతం చేసుకుంటుందని ఆ ఛానల్ చేసిన సర్వేలో వెల్లడైంది.

ప్రముఖ జర్నలిస్టు అర్ణబ్ గోస్వామి ఆధ్వర్యంలో నడుస్తున్న రిపబ్లికన్ టీవీ ఛానల్ చేసిన ఈ సర్వే చంద్రబాబు గుండెల్లో పెద్ద బండరాయి వేసింది. ఇప్పటికిప్పుడు దేశంలో ఎన్నికలు జరిగితే ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ఎన్ని ఎంపీ స్థానాలను గెలుస్తుందో తెలుసుకునేందుకు ఈ సర్వే నిర్వహించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో టీడీపీ-బీజేపీ కూటమికి 12 ఎంపీ స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని సర్వే తేల్చింది. అంటే 2014 ఎన్నికలతో పోలిస్తే టీడీపీ-బీజేపీ కూటమి 5 ఎంపీ స్థానాలను కోల్పోయినట్లవుతుంది. ఇక వైసీపీ అనూహ్యంగా పుంజుకుంటుందని, ఆ పార్టీ 13 లోక్‌సభ స్థానాలను ఒంటిరిగానే గెలుచుకుంటుందని రిపబ్లిక్ టీవీ సర్వేతేల్చింది. కాంగ్రెస్‌ ఈసారి కూడా గుండు సున్నాయేనని వెల్లడించింది. 2014 ఎన్నికలతో పోలిస్తే వైసీపీ అదనంగా ఐదు ఎంపీ స్థానాలను సొంతం చేసుకోనుందని సర్వేలో తేల్చి చెప్పింది.

దీంతో ఆయా పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీనియోజకవర్గాల్లోనూ దాదాపుగా అదే ఫలితం ఉంటుందని.. ఫలితంగా చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడం కష్టమన్న అభిప్రాయం వినిపిస్తోంది. మొత్తానికి సుదీర్ఘ పాదయాత్రతో రాష్ర్ట ప్రజలను కలుసుకుంటున్న జగన్‌ శిబిరంలో ఈ వార్త కొత్త ఉత్సాహాన్నిస్తోందట.