Begin typing your search above and press return to search.

కేటీఆర్‌ కు అదిరిపోయే పంచ్ అంటే ఇదే

By:  Tupaki Desk   |   23 Oct 2016 9:40 AM GMT
కేటీఆర్‌ కు అదిరిపోయే పంచ్ అంటే ఇదే
X
మేకిన్ తెలంగాణ పేరుతో స్వ‌రాష్ట్ర బ్రాండ్‌ ను ప్ర‌మోట్ చేసేందుకు శ‌త‌విధాల ప్ర‌య‌త్నిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఐటీ - పరిశ్ర‌మ‌ల శాఖా మంత్రి కేటీఆర్‌ కు ఆయ‌న ప్రియ‌మైన స్టేట్‌ మెంట్‌ తోనే మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి గట్టి పంచ్ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లాలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూసేవేసేందుకు రంగం సిద్ధం చేసిన నేప‌థ్యంలో... ఫ్యాక్ట‌రీ పరిరక్షణ కోసం చేపట్టిన మహా పాదయాత్ర మూడోరోజు బోధన్ మండలానికి చేరింది. ఈ సందర్భంగా మాజీ స్పీక‌ర్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ మేకిన్ తెలంగాణ అంటే ఫ్యాక్టరీని మూసేయ్యడమేనా? అనేదానికి మంత్రి కేటీఆర్ స‌మాధానం ఇవ్వాల‌ని కోరారు.

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప్ర‌వేశ‌పెట్టి మేకిన్ ఇండియా స్పూర్తితో తెలంగాణ ప్ర‌భుత్వంలో మేకిన్ తెలంగాణ తీసుకువ‌స్తున్నామ‌ని చెప్తున్న సీఎం కేసీఆర్ ఆయ‌న త‌న‌యుడు-మంత్రి కేటీఆర్‌ లు ఇప్ప‌టికే ఉన్న ఫ్యాక్ట‌రీ గురించి ఎందుకు మాట్లాడ‌టం లేద‌ని ప్ర‌శ్నించారు. ప‌థ‌కాల పేర్లు చెప్పుకొంటూ అటు ప్ర‌ధాన‌మంత్రి మోడీ - ఇటు సీఎం కేసీఆర్‌ లు టైం పాస్ చేయ‌డం త‌ప్ప నిజ‌మైన స‌మ‌స్య‌ల గురించి ఆలోచించ‌డం లేద‌ని సురేష్ రెడ్డి మండిప‌డ్డారు. ఆధునిక పద్ధతుల్లో సాగు చేస్తున్న చెరకు రైతులకు ఆసరాగా నిలవాల్సిందిపోయి షుగర్ ఫ్యాక్టరీని మూసేయడం ఎంతవరకు సమంజసమన్నారు. అనంతరం మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ఫ్యాక్టరీని ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని శాసనసభలో శాసనసభా కమిటీ ఆమోదించినా చర్యలు చేపట్టకపోవడం శోచనీయమన్నారు.

ఇదిలాఉండ‌గా నిజాందక్కన్ షుగర్స్ లిమిటెడ్(ఎన్డీఎస్ఎల్) లేఆఫ్ నిర్ణయం సంబంధిత బోర్డు తీసుకున్నదేనని చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ ఎం. సుబ్బరాజు పేర్కొన్నారు. 2015లో కరువు నెలకొన్న నేపథ్యంలో చెరకు అందుబాటులో లేని కారణంగానే లే ఆఫ్ ప్రకటించామన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండానే 70 మంది కార్మికులు కార్యాలయంపై దాడి చేసి రూ.10లక్షల ఆస్తినష్టం చేశారని ఆయ‌న వ్యాఖ్యానించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/