గర్బవతితో స్టార్ హీరో ప్రవర్తనపై తీవ్ర విమర్శలు

Sat Apr 20 2019 15:08:58 GMT+0530 (IST)

మలయాళంలో స్టార్ నటుడిగా గుర్తింపు దక్కించుకుని సౌత్ ఇండియా మొత్తం కూడా మంచి గుర్తింపు ఉన్న స్టార్ హీరో సురేష్ గోపీ ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నాడు. ప్రస్తుతం ఈయన బీజేపీ తరపున కేరళలోని త్రిశూల్ పార్లమెంట్ నియోజక వర్గం నుండి పోటీ చేస్తున్నాడు. సినిమాలతో పాటు రాజకీయాలు కూడా చేస్తున్న సురేష్ గోపీ తాజాగా వివాదాస్పదం అయ్యాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంతో మందిని కలుస్తూ వారితో మాట్లాడుతూ వారితో ఫొటోలు దిగుతూ ముందుకు సాగుతున్న సురేష్ గోపీ తాజాగా ఒక గర్బవతి అయిన మహిళతో కొన్ని సెకన్ల పాటు ముచ్చటించి ఆమెతో ఫొటో దిగాడు.సురేష్ గోపీ ఆమెతో  మామూలుగా మాట్లాడి ఫొటో దిగితే ఈ విషయం గురించి మాట్లాడుకునే వాళ్లం కాదు. కాని సురేష్ గోపీ కార్లో కూర్చుని ఉండి ఆమె బయట ఉండగా ఆమె పొట్టపై చేయి వేయడం జరిగింది. ఆయన పరాయి మహిళపై చేయి వేయడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మరియు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. రాజకీయాల పేరుతో సురేష్ గోపీ నీచంగా ప్రవర్తించాడని చీప్ పబ్లిసిటీ కోసం అతడు ఈ పని చేశాడు అంటూ మండి పడుతున్నారు. ఒక గర్బవతి అయిన మహిళ పొట్టపై పరాయి పురుషుడు ఎలా చేయి వేస్తాడు అంటూ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

అయితే ఈ విషయమై బీజేపీ నాయకులు చాలా లైట్ గా స్పందిస్తున్నారు. సురేష్ గోపీ ఆమెపై ఒక సోదర భావంతోనే చేయి వేశాడని దానికి ఎందుకు ఇలా విమర్శలు చేస్తున్నారంటూ కౌటర్ ఇస్తున్నారు. ఆమె పొట్టపై చేయి వేసి ఒక సోదరుడి మాదిరిగా ఆశీర్వదించాడని అంటున్నారు. అయినా కూడా కొందరు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సురేష్ గోపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూనే ఉన్నారు. సురేష్ గోపీ దీనిపై ఎలా స్పందిస్తాడో చూడాలి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోను ఇక్కడ చూడవచ్చు.

Click Here For Video