Begin typing your search above and press return to search.

సుప్రీంకోర్టు సైట్ హ్యాక్ అయ్యిందా?

By:  Tupaki Desk   |   19 April 2018 10:55 AM GMT
సుప్రీంకోర్టు సైట్ హ్యాక్ అయ్యిందా?
X
దేశ అత్యున్న‌త న్యాయ‌స్థాన‌మైన సుప్రీంకోర్టు అధికారిక వెబ్ సైట్ హ్యాక‌ర్ల దాడికి గురైందా? అంటే అవున‌నే మాట బ‌లంగా వినిపిస్తుంది. సుప్రీంకోర్టు ఆఫిషియ‌ల్ వెబ్ సైట్ ను ఓపెన్ చేసేందుకు ప్ర‌య‌త్నించ‌గా.. అండ‌ర్ మొయింటైనెన్స్ అన్న మెసేజ్ చిన్న అక్ష‌రాల్లో ద‌ర్శ‌న‌మిస్తూ సైట్ ఓపెన్ కావటం లేదు. హైటెక్ బ్రెజిల్ టీంగా చెప్పుకుంటున్న సైబ‌ర్ దొంగ‌ల ముఠా సుప్రీంకోర్టు వెబ్ సైట్ ను హ్యాక్ చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

సుప్రీం వెబ్ సైట్ ను హ్యాక్ చేసిన వైనంపై ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి అధికారిక వివ‌ర‌ణ వెలువ‌డ‌లేదు. సుప్రీంకోర్టు వెబ్ సైట్ ఓపెన్ కావ‌టం లేద‌ని.. హ్యాక్ అయ్యింద‌న్న స‌మాచారం సోష‌ల్ మీడియాలో భారీగా వైర‌ల్ అవుతోంది.ఇది అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

గ‌తంలోనూ ఇదే ముఠా 2013లో భార‌త్‌ కు చెందిన ప‌లు వెబ్ సైట్ల‌ను.. ప్ర‌పంచ వ్యాప్తంగా వంద‌లాది వెబ్ సైట్ల‌ను హ్యాక్ చేసిన‌ట్లుగా చెబుతున్నారు. తొలుత సైట్ హ్యాక్ అయిన వెంట‌నే.. హ్యాకింగ్ కు గురైంద‌న్న స‌మాచారం తెలిసేలా హ్యాక‌ర్లు ఆకు ఆకారంలో ఓ లోగోను పోస్టు చేసిన‌ట్లు చెబుతున్నారు. వెంట‌నే స్పందించిన సంబంధిత అధికారులు దాని స్థానే.. వైట్ పేజీని.. పైన సైట్ నిర్వ‌హ‌ణ‌లో ఉన్న‌ట్లుగా స‌మాచారం ఇస్తూ బ్లాంక్ గా ద‌ర్శ‌న‌మిస్తోంది.

ఇటీవ‌ల భార‌త ర‌క్ష‌ణ శాఖ‌.. హోం.. న్యాయ‌శాఖ‌ల‌కు చెందిన అధికారిక వెబ్ సైట్లు హ్యాకింగ్ కు గురి కాగా తాజాగా అత్యున్న‌త న్యాయ‌స్థాన‌మైన సుప్రీం కోర్టు వెబ్ సైట్ హ్యాకింగ్‌కు గురి కావ‌టం ఇప్పుడు విస్మ‌యానికి గురి చేస్తోంది.