Begin typing your search above and press return to search.

మోడీ త‌ల‌నొప్పి తొలిగిపోయింది

By:  Tupaki Desk   |   11 Jan 2017 4:59 PM GMT
మోడీ త‌ల‌నొప్పి తొలిగిపోయింది
X
ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోడీకి పెద్ద ఉప‌శ‌మ‌నం క‌లిగించే తీర్పు వెలువ‌డింది. గుజ‌రాత్ సీఎంగా ఉన్న స‌మ‌యంలో స‌హారా - బిర్లా నుంచి ప్ర‌ధాని మోడీ కి ముడుపులు అందాయ‌న్న ఆరోప‌ణలు ఉన్న విష‌యం తెలిసిందే. దీనిపై విచార‌ణ జ‌రుపుతున్న సుప్రీంకోర్టు స‌హారా డైరీల కేసులో స్పెష‌ల్ ఇన్వెస్టిగేష‌న్ టీమ్‌ తో విచార‌ణ ఉండ‌బోద‌ని స్ప‌ష్టంచేసింది. స‌రైన సాక్ష్యాధారాలు లేని కార‌ణంగా ఈ కేసును విచారించ‌లేమ‌ని కోర్టు చెప్పింది. గ‌తంలో న‌వంబ‌ర్ 14న విచార‌ణ సంద‌ర్భంగా కూడా కోర్టు ఇదే అభిప్రాయం వ్య‌క్తం చేసింది.

తాజాగా సీనియ‌ర్ లాయ‌ర్ ప్ర‌శాంత్ భూష‌ణ్ వేసిన పిటిష‌న్‌ పై మ‌రోసారి కోర్టు విచార‌ణ జ‌రిపింది. స‌హారా - బిర్లా డైరీలు సాక్ష్యాలేవీ చూప‌కున్నా.. వీటి ఆధారంగా అందులో ఉన్న వ్య‌క్తుల‌పై ఎఫ్ ఐఆర్ న‌మోదు చేసి విచార‌ణ‌కు ఆదేశించాల‌ని ప్ర‌శాంత్ భూష‌ణ్ వాదించారు. ఏదైనా నేరం చేస్తే ఆ వ్య‌క్తిపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని గ‌తంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన విష‌యాన్ని ఆయ‌న గుర్తుచేశారు. అయితే ప్ర‌భుత్వం త‌ర‌ఫున హాజ‌రైన అటార్నీ జ‌న‌ర‌ల్ ముకుల్ రోహ‌త్గీ వాదిస్తూ.. కార్పొరేట్స్ నుంచి మోడీ ముడుపులు తీసుకున్న‌ట్లు ఎలాంటి సాక్ష్యాలు లేవ‌ని, ఇలాంటి ప‌త్రాల‌ను లీగ‌ల్ ఎవిడెన్స్‌గా ప‌రిగ‌ణిస్తే దేశ భ‌ద్ర‌త‌కే ముప్పు అని వాదించారు. 2013 - 2014ల‌లో సీబీఐ - ఐటీ శాఖ అధికారులు స‌హారా - బిర్లా కార్యాల‌యాల్లో సోదాలు నిర్వ‌హించి సేక‌రించిన ప‌త్రాల‌నే స‌హారా డైరీలుగా ప‌రిగ‌ణిస్తున్నారు. అందులో అప్ప‌టి గుజ‌రాత్ సీఎంగా ఉన్న మోడీ - కాంగ్రెస్ సీనియ‌ర్ నేత షీలా దీక్షిత్‌ తోపాటు ప‌లు ఇత‌ర పార్టీల నేత‌ల పేర్లు ఉన్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/