వరల్డ్ కప్ ఫైనలిస్టులు ఎవరంటే... గూగుల్ పిచాయ్ చెప్పేశారు

Sat Jun 15 2019 18:24:08 GMT+0530 (IST)

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ నిత్యం కంప్యూటర్ల గోలే. ఎక్కడున్నా ఏం చేసినా కూడా నిజంగా కూడా పిచాయ్ కిం అంతా ఆ గోలే. ఆ గోలను పక్కనపెట్టి ఇతర అంశాలపై దృష్టి సారించడం పిచాయ్ కి దాదాపుగా దుస్సాధ్యమే. అయితే ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకుంటూ తనలో దాగి ఉన్న ఓ క్రీడాభిమానిని బయటకు తీసురకొచ్చారు పిచాయ్. జెంటిల్మన్ గేమ్ గా ప్రసిద్దిగాంచిన క్రికెట్ పై తనకు ఎనలేని ఆసక్తి ఉందని చెప్పిన పిచాయ్... ప్రస్తుతం యావత్తు క్రికెట్ ప్రేమికులను టీవీల తెరలకు కట్టిపడేస్తున్న ఐసీపీ వన్డే వరల్డ్ కప్ పై తన ప్రిడిక్షన్ ను కూడా చెప్పేశారు.ఈ వరల్డ్ కప్ లో ఫైనల్ వచ్చే జట్లివేనంటూ పిచాయ్ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. భారత్ కే చెందిన పిచాయ్ ఉద్యోగం నిమిత్తం అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఆ తర్వాత తాను ఓ చిరుద్యోగిగా చేరిన గూగుల్ సంస్థకు సీఈఓగా ఎదిగారు. అయినా కూడా క్రీడల పట్ల తనకు ఉన్న ఆసక్తిని ఎప్పటికప్పుడు బయటపెట్టుకుంటూనే ఉన్న పిచాయ్... ఇటీవల జరిగిన ఓ పారిశ్రామికవేత్తల సదస్సులో వరల్డ్ కప్ పై ఆసక్తికర కామెంట్లు చేశారు. ఈ వరల్డ్ కప్ లో టీమిండియా తప్పనిసరిగా ఫైనల్ కు చేరుకుంటుందని ప్రిడిక్షన్ వెల్లడించిన పిచాయ్.. ఫైనల్ లో టీమిండియాతో పోటీ పడే జట్లు ఇంగ్లండేనని తేల్చి పారేశారు.

న్యూజిల్యాండ్ ఆస్ట్రేలియా జట్లను కూడా తక్కువగా అంచనా వేయలేమని చెప్పిన పిచాయ్... ఫైనల్ కు చేరే జట్లు మాత్రం టీమిండియా ఇంగ్లండ్ జట్లేనని ఆయన వెల్లడించారు. ఇక క్రీడలకు సంబంధించి తనలోని క్రీడాకారుడిని కూడా ఆయన బయటపెట్టుకున్నారు. అమెరికా వచ్చిన కొత్తలో సాఫ్ట్ బాల్ ఆడాాలనుకున్నానని అయితే తొలిసారే సాఫ్ట్ బాల్ ను తాను బాదిన తీరుతో అందరూ నోరెళ్లబెట్టారని దీంతో తాను క్రికెట్ వైపు మళ్లానని పిచాయ్ చెప్పుకొచ్చారు. ఏదేమైనా కంప్యూటర్లతో ఎంత బిజీగా ఉన్నా కూడా వరల్డ్ కప్ పై మాత్రం పిచాయ్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ గానే మారిందని చెప్పక తప్పదు.