Begin typing your search above and press return to search.

కూక‌ట్‌ ప‌ల్లి వాసుల‌కు సుహాసిని లేఖ‌!

By:  Tupaki Desk   |   12 Dec 2018 3:34 PM GMT
కూక‌ట్‌ ప‌ల్లి వాసుల‌కు సుహాసిని లేఖ‌!
X
2018 తెలంగాణ ఎన్నికల్లో అనూహ్యంగా వినిపించిన పేరు నందమూరి సుహాసిని. కూకట్ పల్లి తెలుగుదేశం టిక్కెట్టు ఎప్పటినుంచో పెద్దిరెడ్డికి కాకుండా అనూహ్యంగా తెరపైకి వచ్చిన నందమూరి సుహాసిని అలియాస్ చుండ్రు సుహాసినికి దక్కింది. ఇది చంద్రబాబు రాజకీయం. అయితే కేసీఆర్ గాలిలో కాంగ్రెస్-చంద్రబాబు-కోదండరాం సంయుక్త వ్యూహాలు పటాపంచలు అయ్యాయి. వారి ఆశించిన దాంట్లో కనీసం పాతిక శాతం కూడా నెరవేరలేదు. చివరకు భారీ తేడాతో టీఆర్ఎస్ మాధవరం కృష్ణారావు చేతిలో సుహాసిని ఘోరంగా ఓడిపోయారు. రెండ్రోజులు మౌనంగా ఉన్న సుహాసిని తాజాగా స్పందించారు.

ఈ రోజు ఆమె కూకట్ పల్లి నియోజకవర్గ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఆమె లేఖలోని విషయాలు ఇవి.

'కూకట్ పల్లి నియోజకవర్గం ప్రజలందరికీ నన్ను అతి తక్కువ కాలంలోనే ఆదరించి అక్కున చేర్చుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు శ్రేయోభిలాషులకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు. నన్ను ఆధరించిన కూకట్పల్లి నియోజకవర్గ ప్రజానీకానికి నేను ఎల్లప్పుడు రుణపడి ఉంటాను. నేను కూకట్ పల్లి లోనే ఉండి ప్రజలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజాసేవ చేస్తాను. ఈ ఎన్నికలలో ప్రజల నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నాను.

*ఇట్లు
నందమూరి సుహాసిని

ఇది ఆమె రాసిన లేఖ? ఓడిపోయిన వెంటనే నేను నియోజకవర్గం ఖాళీ చేయడం లేదు. ప్రతిపక్షంగా ప్రజల తరఫున పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆమె చెప్పారు. మరి సడెన్గా తెలుగుదేశంలో కేవలం ఈమె మాత్రమే లేఖ రాయడంలో రాజకీయ ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా.. అని పలువురు అనుమాన పడుతున్నారు. టెంపరరీగా తెచ్చారు ఓడిపోయిన వెంటనే అడ్రెస్ లేకుండా పోయారు. ఒకవేళ గెలిచినా కూడా ఇక్కడ ఉండేవారు కాదని వస్తున్న విమర్శలకు సమాధానంగా ఈ లేఖ వచ్చినట్లు భావించాలేమో.