Begin typing your search above and press return to search.

బాబుకు షాక్‌..సీన్ లోకి సుబ్రమణ్యస్వామి ఎంట్రీ

By:  Tupaki Desk   |   21 May 2018 6:04 PM GMT
బాబుకు షాక్‌..సీన్ లోకి సుబ్రమణ్యస్వామి ఎంట్రీ
X
తిరుమల తిరుపతి దేవస్ధానం పాలకమండలిపై క‌ల‌క‌లం రేపే వ్యాఖ్యలు చేసి పదవిని కోల్పోయిన తిరుమల శ్రీవారి ఆలయం ప్రధానార్చకులు రమణ దీక్షితులు ఉదంతం మ‌లుపులు తిరుగుతోంది. ధర్మానికి ,శాస్త్రాలకు విరుద్ధంగా టీటీడీ బోర్డు, అధికారులు వ్యవహరిస్తున్నారని, స్వామి వారి నిత్య పూజలకు ,సేవలకు కూడా కొంతమంది ఉద్దేశపూర్వకంగా అడ్డు తగులుతున్నారని ఆరోపించిన దీక్షితులు ధర్మానికి ,శాస్త్రాలకు విరుద్ధంగా టీటీడీ బోర్డు, అధికారులు వ్యవహరిస్తున్నారని తిరుమ‌ల‌లోని వ్య‌వ‌హారాల‌పై సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌రిణామంపై స‌ర్కారు భ‌గ్గుమ‌న‌డం - దీక్షితులు ప‌ద‌వి ఊడ‌టం...దీక్షితులుకు మ‌ద్ద‌తుగా ప‌లువురు హిందుత్వ‌వాదులు మ‌ద్ద‌తివ్వ‌డం, ఈ ప‌రిణామం బాబు స‌ర్కారుకు మ‌ర‌క‌గా మార‌టం అనే ఎపిసోడ్‌లో మ‌రో సంచ‌ల‌న ప‌రిణామం జోక్యం చేసుకుంది.

బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత‌, ఎంపీ సుబ్రమణ్యస్వామి ఈ ఎపిసోడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన్ను పదవి నుంచి తొలగించడంపై సుబ్ర‌మ‌ణ్య‌స్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీలో ఆర్ధిక అవకతవకలపై సీబీఐ విచారణను ఆదేశించాలని ఆయన పేర్కొన్నారు.ఈ మేర‌కు ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. అంతేకాకుండా ర‌మ‌ణ‌దీక్షితులు తొల‌గింపుపై న్యాయపోరాటం చేస్తానని ప్ర‌క‌టించారు. ఏకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు వృత్తిరిత్యా న్యాయ‌వాద అయిన‌ స్వామి ప్ర‌క‌టించారు. కాగా, బాబు స‌ర్కారును ఇర‌కాటంలో ప‌డేసిన ఉదంతంపై బీజేపీ పెద్దాయ‌న తెర‌మీద‌కు రావ‌డం, ఏకంగా సుప్రీంకోర్టులో కేసు వేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.

మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం రమణ దీక్షితులు కామెంట్లు, ఆయ‌న తొల‌గింపు వ్య‌వ‌హారంపై స్పందించారు. ఆభరణాలు పోయినట్లుగా ఎప్పటి నుంచో అనుమానాలున్నాయని.. అవి ఇండియా నుంచి ఇజ్రాయెల్ వెళ్లినట్లు గతంలో తనకు ఒక అధికారి చెప్పాడని జనసేనాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీక్షితులు చేసిన వ్యాఖ్యలను పరిగణనలోనికి తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీటీడీ వివాదంపై ముఖ్యమంత్రే స్వయంగా మాట్లాడాలని పవన్ కోరారు.