Begin typing your search above and press return to search.

కేర‌ళ బాధితుల‌కు క్రీడాకారుల సాయం!

By:  Tupaki Desk   |   18 Aug 2018 10:45 AM GMT
కేర‌ళ బాధితుల‌కు క్రీడాకారుల సాయం!
X

కేరళ వరద బాధితుల ప‌లువురు సినీ న‌టులు - సెల‌బ్రిటీలు - రాజ‌కీయ నాయ‌కులు - స్వ‌చ్ఛంద సేవా సంస్థ‌లు విరాళాలు ప్ర‌క‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా - క్రీడాకారులు కూడా కేర‌ళ వ‌ర‌ద బాధితుల‌కు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వ‌చ్చారు. ఐపీఎల్‌ స్టార్‌ - భారత యువ క్రికెటర్‌ సంజూ శాంసన్‌...కేర‌ళ సీఎంఆర్ ఎఫ్ కు రూ.15 లక్షలు విరాళ‌మిచ్చాడు. శాంస‌న్ తండ్రి - సోదరుడు.... సీఎం పినరయి విజయన్ ను కలిసి చెక్‌ అందజేశారు. మ‌రోవైపు, కేర‌ళ వ‌ర‌ద‌బాధితుల‌కు అండ‌గా ఉండాలని విరాట్ కోహ్లీ - హార్దిక్ పాండ్యా ట్వీట్ చేశారు. అయితే, తాను పబ్లిసిటీ కోసం విరాళం ఇవ్వ‌లేద‌ని - వరదల వల్ల నష్టపోయినవారికి సాయం చేయాల‌నే ఉద్దేశంతో ఇచ్చాన‌ని శాంస‌న్ తెలిపాడు. ఎవ‌రికి తోచిన‌ సాయం వారు చేస్తున్నార‌ని - త‌న‌ను చూసి మిగ‌తావారు ముందుకు రావాల‌ని కోరాడు. కేరళలో పరిస్థితి మెరుగుపడాలని - అక్క‌డి ప్ర‌జ‌లు ధైర్యంగా ఉండాల‌ని కోహ్లీ ట్వీట్ చేశాడు. బాధితుల‌కు సాయం చేస్తోన్న ఆర్మీ - ఎన్డీఆర్ ఎఫ్‌ ల సేవలకు హ్యాట్సాఫ్ అని కోహ్లీ అన్నాడు. కేరళ ప్రజలకు తోచిన సాయం చేస్తూ అండగా నిలవాలని హార్దిక్ పాండ్యా పిలుపునిచ్చాడు. కేర‌ళ ప్ర‌జ‌ల‌కు సాయం చేయాలని భారత ఫుట్‌ బాల్‌ కెప్టెన్‌ సునీల్‌ చెత్రీ ....ప్రజలకు విజ్ఞప్తి చేశాడు.

అంత‌కుముందు, కోలీవుడ్ నటుడు క‌మ‌ల్ హాస‌న్ 25 ల‌క్ష‌లు - కార్తీ-సూర్య 25 ల‌క్ష‌లు కేర‌ళ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా ఇచ్చారు. ఇక టాలీవుడ్ నుంచి ప్ర‌భాస్ కోటి రూపాయ‌లు - రామ్ చ‌ర‌ణ్ 60 ల‌క్షలు - ఉపాస‌న 1.2 కోట్లు - కొర‌టాల శివ 3 ల‌క్ష‌లు - విజ‌య్ దేవ‌రకొండ 5 ల‌క్ష‌లు - హీరో రామ్ 5 ల‌క్ష‌లు ...కేర‌ళ సీఎంఆర్ ఎఫ్ కు డొనేట్ చేశారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ 25 కోట్లు - ఏపీ సీఎం చంద్ర‌బాబు 10 కోట్లు ఇవ్వ‌గా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ - పంజాబ్‌ సీఎం అమరీందర్‌ రూ.10 కోట్ల చొప్పున సాయం ప్రకటించారు. రూ.10 కోట్ల విరాళాన్ని కేరళ సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కు పంపుతున్నట్లు అమ్మ ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు అమృతానందమయి చెప్పారు. కేరళ సీఎం సహాయ నిధికి రూ.2 కోట్ల విరాళాన్ని స్టార్‌ ఇండియా ప్రకటించింది. రూ.25 లక్షల సాయం చేయనున్నట్లు ఆసియా నెట్ చానెల్ ఉద్యోగులు చెప్పారు.