Begin typing your search above and press return to search.

11 ఆత్మ‌హ‌త్య‌లు జ‌రిగిన ఇంట్లో సంచ‌ల‌న ప‌రిణామాలు

By:  Tupaki Desk   |   27 Jun 2019 1:30 AM GMT
11 ఆత్మ‌హ‌త్య‌లు జ‌రిగిన ఇంట్లో సంచ‌ల‌న ప‌రిణామాలు
X
దేశ రాజ‌ధాని ఢిల్లీ న‌డిబొడ్డున గ‌త ఏడాది జ‌రిగిన సంచ‌ల‌న‌, దారుణ హ‌త్య‌ల ఉదంతం గుర్తుండే ఉంటుంది. ఢిల్లీలోని బురారీ కుటుంబానికి చెందిన 11 మంది మరణాల ఉదంతం క‌ల‌క‌లం రేపింది. నారాయణ దేవి అనే 77 ఏళ్ల వృద్ధురాలి చిన్న కుమారుడు లలిత్‌ భాటియా తనతో పాటు తన కుటుంబానికే చెందిన మరో 10 మంది సామూహిక ఆత్మహత్యలకు ప్రణాళిక రూపొందించాడు. లలిత్‌ భాటియా తండ్రి పదేళ్ల క్రితమే మరణించగా. మరణించిన తండ్రి తనకు కనిపిస్తున్నాడని - తనతో మాట్లాడుతున్నాడని.. తనకు సందేశాలు ఇస్తున్నాడని కుటుంబ సభ్యులంద‌రం క‌లిసి మ‌ర‌ణిస్తే...తండ్రి త‌మ‌కు స్వాగ‌తం ప‌లుకుతాడ‌ని అంద‌రికీ చెప్ప‌డంతో వారంతా ఉరివేసుకొని చ‌నిపోయారు. అయితే, వారు నివ‌సించిన ఇల్లు సంచ‌ల‌న ప‌రిణామాల‌తో తెర‌మీద‌కు వ‌చ్చింది.

ల‌లిత్ భాటియా నివాసాన్ని గత ఏడాది అక్టోబర్‌లో దినేష్‌ చుంద్వాత్‌ అనే వ్యక్తి గత ఏడాది అక్టోబర్‌ లో కోటిన్నర రూపాయలకు ఇంటిని కొనుగోలు చేశాడు. డబ్బు అవసరం ఉండటంతో.. ఇంటిని అమ్మేందుకు ప్రయత్నించగా అతీంద్రియ శ‌క్తుల‌తో 11 మంది సామూహిక ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని - ఈ ఇంటిలో ఆత్మలు తిరుగుతున్నాయనే పుకార్లు పెద్ద ఎత్తున‌ వ్యాపించడం వారికి షాక్ వ‌లే మారింది. ఆ ఇంటిని కొనడానకి ఎవరూ ముందుకు రావడం లేదు. ఒక వేళ వచ్చినా.. చాలా తక్కువ ధరకు అడుగుతున్నారు. ఈ క్రమంలో ఇంటి మీద వచ్చిన పుకార్లు నిజం కాదని నిరూపించి.. మంచి రేటుకు ఇంటిని అమ్మాలని భావించిన దినేష్ షార్ట్‌ క‌ట్ ప్లాన్ వేశాడు. దెయ్యాలు తిరుగుతున్నాయనే ప్రచారంతో విలువైన ఇంటిని ఎవరూ కొనడానికి ముందుకు రాకపోవడం.. ఈ క్రమంలో హీరో అక్కడ కొన్ని రోజుల పాటు గడిపి.. అవన్ని ఒట్టి పుకార్లే అని నిరూపిస్తుండే సినిమాలుచ న‌వ‌ల‌ల ఫార్ములాను అమ‌ల్లో పెట్టాడు.

వృత్తిరీత్యా కార్పెంటర్‌ పని చేస్తూ దెయ్యాలు తిరుగుతున్నాయనే ప్రచారం జరిగే ఇళ్లలో నివాసం ఉండే అహ్మద్‌ అలీ - అస్ఫర్‌ అలీని సంప్ర‌దించాడు. రెంట్‌ ఇవ్వాల్సిన అవ‌సరం లేకుండా కొన్ని రోజులు పాటు తన ఇంట్లో ఉండాల్సిందిగా దినేష్‌ వారిని కోరాడు. దినేష్‌ కోరిక మేరకు అలీ సోదరులు ప్రస్తుతం ఈ ఇంట్లో నివాసం ఉంటున్నారు. భేషుగ్గా త‌మ ప‌నులు చ‌క్క‌బెట్టుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా త‌మ‌కు ఎదురైన అనుభ‌వాలు వారు పంచుకుంటూ...``మేం బురారీ కుటుంబ సభ్యుల ఇంట్లో ఉండటం తమ ఇంట్లో వారికి కూడా ఇష్టం లేదు. మమ్మల్ని ఇక్కడకు రాకుండా అడ్డుకోవాలని ప్రయత్నించారు. కానీ తాము అందుకు ఒప్పుకోలేదు. మేం ఈ ఇంట్లో భేషుగ్గా ఉంటున్నాం. తొలి రోజు మేం నారాయణి దేవి రూంలో ఆమె మంచం మీద పడుకున్నాం. మాకేం తేడాగా అన్పించలేదు. తరువాత మేం ఇంట్లో ఉన్న వేర్వేరు బెడ్రూంల్లో ఒంటరిగా పడుకుంటున్నాం. మాకు ఇబ్బందేం లేదు`` అని వ్యాఖ్యానించారు.

బురారీ ఇల్లు కొనుగోలు చేసిన దినేష్ ప‌రిస్థితి గురించి ఓ రియాల్ట‌ర్ మాట్లాడుతూ - ఇలాంటి దారుణాలు జరిగిన ఇళ్లను కొనడానికి జనాలు ఆసక్తి చూపరని తేల్చిచెప్పారు. ``కొనుగోలు చేయాల‌ని భావించే వారు సైతం చాలా తక్కువ రేటు చెప్తారు. కొందామనే భావిస్తారు. అయితే, బురారీ ఇళ్లు రోడ్డుకు దగ్గర్లో ఉంది. పెయింట్‌ వేసి.. చిన్న చిన్న మార్పులు చేస్తే.. మంచి ధర పలుకుతుంది. కానీ ముందు ఆ ఇంటి గురించి ప్రచారం అవుతున్న పుకార్లు అవాస్తవమని తేల్చాలి`` అని వెల్ల‌డించారు.