Begin typing your search above and press return to search.

గంగూలీకి పీఠం.. అమిత్ షా వ్యూహం

By:  Tupaki Desk   |   14 Oct 2019 5:24 AM GMT
గంగూలీకి పీఠం.. అమిత్ షా వ్యూహం
X
ఫైర్ బ్రాండ్ - మాజీ దిగ్గజ క్రికటర్ సౌరవ్ గంగూలీకి అత్యున్నత పదవి దక్కబోతోంది. దేశంలోనే అత్యంత క్రేజ్ కలిగిన క్రికెట్ బాస్ పగ్గాలు చేపట్టబోతున్నాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా గంగూలి ఎన్నిక కావడం దాదాపు ఖాయమైందన్న సమాచారం అందుతోంది.

తాజాగా ముంబైలో సమావేశమైన దేశంలోని రాష్ట్ర క్రికెట్ సంఘాలు అధ్యక్షుడిగా గంగూలీ పేరును దాదాపు ఖాయం చేసినట్టు సమాచారం. ఇటీవలే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమైన గంగూలీ ఈ మేరకు బీసీసీఐ అధ్యక్ష పీఠం తనకు దక్కేలా లాబీయింగ్ చేసినట్టు సమాచారం. అయితే అమిత్ షా తన కుమారుడిని బీసీసీఐ ప్రధాన కార్యదర్శిని చేయడానికే గంగూలీకి మద్దతు ఇచ్చినట్టు వార్తలు వెలువడ్డాయి. గంగూలీ అధ్యక్షుడిగా తన కుమారుడు బీసీసీఐ ప్రధాన కార్యదర్శిగా చక్రం తిప్పడానికి గంగూలీ ఓకే అన్నాకే అతడికి మద్దతు పలికినట్లు సమాచారం.ఇతడికి పోటీగా ఉన్న బీసీసీఐ మాజీ అధ్యక్షులు శ్రీనివాసన్ - అనురాగ్ ఠాకూర్ నుంచి గట్టి పోటీ ఉన్న దరిమిలా గంగూలీ ఢిల్లీ వెళ్లి అమిత్ షా మద్దతు కోరినట్లు తెలిసింది.

అమిత్ షా మద్దతు లభించడంతో గంగూలీ బీసీసీఐ పీఠాన్ని అధిరోహించబోతున్నాడు. ప్రస్తుతం బీసీసీఐ పాలన గాడి తప్పింది. బోర్డులో లోధా కమిటీ సిఫార్సుల అమలు - క్రికెట్ పాలకుల కమిటీ అతిజోక్యంతో బీసీసీఐ భ్రష్టు పట్టింది. దీంతో గంగూలీకి పోటీగా మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ తన అనుచరుడు బ్రిజేస్ పటేల్ ను తెరపైకి తెచ్చాడు. కానీ సమర్థుడైన గంగూలీ అయితే బీసీసీఐని గాడిలో పెట్టగలడని నమ్మి రాష్ట్ర సంఘాలన్నీ ఆయనకే ఓటేశాయి..

సో కుమారుడి కోసం అమిత్ షా చేస్తున్న ఈ లాబీయింగ్ తో బీసీసీఐ అధ్యక్ష పదవి నేడు తేలబోతోంది.