Begin typing your search above and press return to search.

అమెరికాను వ‌ణికిస్తున్న మంచు తుఫాను

By:  Tupaki Desk   |   14 March 2019 4:18 PM GMT
అమెరికాను వ‌ణికిస్తున్న మంచు తుఫాను
X
ఎంతటి అగ్రరాజ్యమైన సరే ప్రక్రుతి ముందు తలొగ్గాల్సిందే. అమెరికాలో మంచు తుఫాను జనజీవానాన్ని అతలాకుతలం చేస్తోంది. ఒక రకంగా జనజీవానాన్ని స్తంభింప చేస్తోంది. దీనిని బాంబ్ సైక్లోన్ గా అభివర్ణిస్తున్నారు. రోజురోజుకీ కూడా అక్కడి తుషాను కారణంగా పరిస్థితులు దారుణాతి దారణంగా మారుతున్నాయని చెబుతున్నారు. ఈ తుఫాను కారణంగా 3,100 విమానాలను రద్దు చేసారు. ఈ విమానాలన్ని కూడా డెన్వర్ విమానాశ్రయంలో నిలచిపోయాయి. నడవడానికి వీలులేనంతగా రోడ్లన్నీ కూడా మంచుతో నిండిపోయాయి. ఈదురుగాలులతో అక్కడి ప్రజానీకం వణికిపోతున్నారు. లోవా - మిశోరి - ఇలోనీస్ వంటి ప్రాంతాలలో నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈదురు గాలులు గంటకు 110 మీటర్ల వేగంతో వీస్తున్నాయని చెబుతున్నారు.

బాంబ్ తుఫాను లేదా మంచు తుఫాను కారణంగా మొత్తం 39 ప్రాంతాలలో స్కూళ్లు - కాలేజీలు - కార్యలయాలకు సెలవలు ప్రకటించింది అక్కడి రాష్ట్ర ప్రభుత్వం. రోడ్ల మీద మంచు 9 అంగుళాల మేరా నిండిపోయినట్లు చెబుతున్నారు. ఈ మంచు తుఫాను కారణంగా 100 కు పైగా వాహనాలు మంచులో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. చంటి పిల్లలకు పాలు - గుడ్లు - ఇతర ఆహార పదార్దాలు కూడా దొరకడం లేదని చెబుతున్నారు. అక్కడి వారి పరిస్థితి చాలా దయనీయంగా ఉందని - సహాయక చర్యలు చేపట్టడానికి కూడా వాతవరణం అనుకూలించడం లేదని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. చాలా మంది ప్రజలు ఎక్కడి వాహానాలు అక్కడే వదిలివేసి - అపరిచితుల ఇళ్లలో తలదాచుకున్నట్లు సమాచారం. తమ వారు ఇంటికి రాక - అసలు ఎమయ్యారో తెలియక అక్కడి ప్రజలు అల్లాడుతున్నారు. ఆస్తినష్టం అపారంగా ఉందని - ఇంకా ప్రాణనష్ఠం తెలియదని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. ఈ బాంబ్ తుఫాను కారణంగా అక్కడి ప్రజలు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కు మంటూ జీవిస్తున్నారు.