Begin typing your search above and press return to search.

ఏపీలోనూ ముందస్తు?

By:  Tupaki Desk   |   13 Nov 2018 1:30 PM GMT
ఏపీలోనూ ముందస్తు?
X
2019 ప్రారంభంలోనే ఏపీలో ఎన్నికల హడావుడి ఊపందుకునే అవకాశాలున్నాయా? అంటే అవుననే అంటున్నాయి ఏపీ ఎన్నికల కమిషన్ అధికారుల వ్యాఖ్యలు. ఎన్నికల కమీషనర్ సిసోడియా.. ఏపిలో కూడా ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలున్నట్లు పరోక్షంగా చెప్పారు. ఫిబ్రవరి 3వ వారంలోనే ఏపిలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నట్లు ఆయన తాజాగా వెల్లడించారు.

లెక్క ప్రకారం ఏపీలో ఎన్నికలు మే నెలలో జరగాలి. అలాంటిది రెండు నెలల ముందే షెడ్యూల్ విడుదలవ్వచ్చని ఎన్నికల ప్రధానాధికారే చెప్పడంతో ఊహాగానాలు మొదలయ్యాయి. తెలంగాణాలో అసెంబ్లీ రద్దు కావటం - ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వటం ఇఫుడు నామానేషన్ల ప్రక్రియ కూడా మొదలైపోయింది. ఇటువంటి నేపధ్యంలోనే సోసిడియా మాట్లాడుతూ ఏపిలో ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి 3వ వారంలో విడుదలవుతుందని చెప్పడంతో ఎన్నికల కమిషన్‌ కు దీని పై సంకేతాలున్నాయన్న వాదన వినిపిస్తోంది.

పైగా ఎన్నికల ఏర్పాట్లు గురించి కూడా సిసోడియా చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో కొత్తగా 30 లక్షల మంది తమ ఓటు హక్కును నమోదు చేసుకున్నట్లు చెప్పారు. దశలవారీగా వివి ప్యాట్ ఈవీఎంలు ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఏపిలో ప్రస్తుతం 3.75 కోట్లమంది ఓటర్లున్నట్లు ఆయన తెలిపారు. మొత్తానికి ఎన్నికల కమిషన్ సన్నద్ధమవుతున్న తీరు చూస్తుంటే ఫిబ్రవరిలో ఎన్నికలు రావడం ఖాయమేన్న వాదన ఏపీలో ఊపందుకుంది