Begin typing your search above and press return to search.

సింగపూర్.. జపాన్ ప్రధానులు రావట్లేదా?

By:  Tupaki Desk   |   9 Oct 2015 6:09 AM GMT
సింగపూర్.. జపాన్ ప్రధానులు రావట్లేదా?
X
మరో పదమూడు రోజుల్లో అంగరంగ వైభవంగా.. ప్రపంచం మొత్తం తనవైపు దృష్టి సారించేలా ఏపీ రాజధాని శంకుస్థాపన చేపట్టాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకుంటున్న విషయం తెలిసిందే. రాజధాని శంకుస్థాపనను భారీగా నిర్వహించటంతో పాటు.. దేశ.. విదేశీ అతిధులతో అంగరంగ వైభవంగా నిర్వహించాలని తపిస్తోంది.

ఈ కార్యక్రమానికి జపాన్ ప్రధాని.. సింగపూర్ ప్రధానుల్ని తీసుకురావాలని చంద్రబాబు విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. అయితే.. జపాన్ ప్రధాని వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తేలటంతో.. కనీసం సింగపూర్ ప్రధానిని అయినా తీసుకురావాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. అయితే.. అది కూడా డౌటేనన్న మాట మంత్రి నారాయణ మాటలు వింటే అర్థమయ్యే పరిస్థితి.

శంకుస్థాపనకు సంబంధించి ఆహ్వానపత్రాలు.. ఏర్పాట్లకు సంబంధించిన విషయాల్ని వివరించే క్రమంలో జపాన్.. సింగపూర్ ప్రధానుల ప్రోగ్రాం ఇంకా ఫిక్స్ కాలేదని చెప్పారు. ఒకసారి వారి నుంచి కన్ఫర్మేషన్ వచ్చాక ఆ వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఒక దేశ ప్రధాని మరో దేశానికి వచ్చే అంశానికి సంబంధించి కనీసం రెండు వారాల ముందే ప్రోగ్రాం ఫిక్స్ అవుతుందన్న మాట వినిపిస్తోంది. ఈ లెక్కన.. ఇప్పటికి ఈ ఇద్దరు ప్రధానుల ప్రోగ్రాంకు సంబంధించి కన్ఫర్మేషన్ రాలేదంటే.. వారు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. దేశ ప్రధానితో పాటు.. ఇతర దేశాల ప్రధానుల్ని తీసుకొచ్చి తన సత్తా చాటాలనుకున్న చంద్రబాబు.. మరేం చేస్తారో చూడాలి.