Begin typing your search above and press return to search.

బొట్టు అంటే భ‌య‌ప‌డేలా అమెరిక‌న్ రిపోర్ట్‌

By:  Tupaki Desk   |   21 Sep 2017 4:44 AM GMT
బొట్టు అంటే భ‌య‌ప‌డేలా అమెరిక‌న్ రిపోర్ట్‌
X
కొన్ని రిపోర్టులను చూస్తే బోలెడ‌న్నీ సందేహాలు క‌లుగుతుంటాయి. తాజాగా అలాంటి నివేదిక ఒక‌టి ఈ రోజు అన్ని మీడియాల‌లో ప్ర‌ముఖంగా వ‌చ్చింది. భార‌తీయ మ‌హిళ త‌ప్ప‌నిస‌రిగా పెట్టుకునే నుదుటి బొట్టుకు ఉప‌యోగించే సింధూరంలో విష‌తుల్య‌మైన ప‌దార్థాలు ఉన్న‌ట్లుగా ఒక అమెరిక‌న్ సంస్థ రిపోర్ట్‌ను ప్ర‌ముఖంగా అచ్చేశారు.

హిందూ మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఉప‌యోగించే కుంకుమ‌లోనూ.. సింధూరం పేరిట అమ్మే వాటిల్లో ప్ర‌మాద‌క‌ర‌మైన సీసం పరిమాణం ఉంటుంద‌ని వెల్ల‌డించింది. అమెరికాలోని రాట్జ‌ర్ విశ్వ‌విద్యాల‌యం ప‌రిశోధ‌కులు చేసిన అధ్య‌య‌నంలో హిందూ మ‌హిళ‌లు ఉప‌యోగించే సింధూరంలో అధిక మోతాదులో సీసం ఉంద‌ని తేల్చింది.

భార‌త్ లో సేక‌రించిన సింధూరంలో 78 శాతం.. అమెరికాలో సేక‌రించిన సింధూరంలో 83 శాతం బొట్ల‌ల్లో ఒక గ్రాముకు 1.0 మెక్రోగ్రామ్ సీసం ఉన్న‌ట్లుగా తాజా నివేదిక పేర్కొంది. న్యూజెర్సీలో 19 శాతం.. భార‌త్ లోని 43 శాతం న‌మూనాల్లో ఒక గ్రాముకు 20 మెక్రో గ్రాముల సీసం ఉన్న‌ట్లుగా తేలింద‌ని చెబుతున్నారు.

ఇది అమెరిక‌న్ ఆహార‌.. ఔష‌ధ నియంత్ర‌ణ సంస్థ నిర్దేశించిన ప్ర‌మాణాల కంటే చాలా ఎక్కువ‌ని తేల్చారు. సీసం ర‌హిత కుంకం వ‌చ్చే వ‌ర‌కూ అమెరికాలో సింధూరాన్ని అమ్మ‌కూడ‌ద‌న్న సూచ‌న‌ను స‌ద‌రు వ‌ర్సిటీ అధ్య‌య‌నం పేర్కొంది. భార‌తీయ మ‌హిళ‌లు ముఖానికి.. నుదిటిన సింధూరాన్ని పెట్టుకుంటారు. అయితే.. ఇందులో శ‌రారానికి హాని చేసే వ‌స్తువులు ఉంటాయ‌ని తాజా రిపోర్ట్ హెచ్చ‌రిస్తోంది.

సీసం ఎక్కువ‌గాఉన్న సింధూరాన్ని పెట్టుకోవ‌టం కార‌ణంగా మూత్ర పిండాలు.. దంతాలు.. గోళ్లు.. జుట్టుకు చేటు చేస్తాయ‌ని చెబుతున్నారు. ఈ కార‌ణంతోనే భార‌త్‌.. పాక్‌.. తూర్పు.. మ‌ధ్య ద‌క్షిణాసియా దేశాల్లో చ‌ర్మానికి పుండ్లు ప‌డ‌టం.. గోళ్లు.. దంతాలు పాడు కావ‌టం లాంటి స‌మ‌స్య‌లు క‌నిపిస్తాయ‌ని పేర్కొన్నారు. చూస్తుంటే.. సింధూరం మాట వింటేనే భార‌తీయులు భ‌య‌ప‌డేలా స‌ద‌రు అమెరికా రిపోర్ట్ ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.