యోగీ.. ద ఫ్యూచర్ ప్రైం మినిష్టర్

Mon Mar 20 2017 13:53:09 GMT+0530 (IST)

యూపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన యోగి ఆదిత్యనాథ్ ప్రస్థానం.. అయన్ను ఎంపిక చేయాల్సిన పరిస్థితులు.. యూపీలో ఆయనకున్న ప్రజాదరణ ఆయన తీరు అన్నీ చూస్తే ఆయనలో మరో మోడీ కనిపిస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు. పదిహేడేళ్ల కిందట నరేంద్ర మోడీని గుజరాత్ సీఎంగా అప్పటి ఉప ప్రధాని అద్వానీ ప్రకటించడం... మోడీ అక్కడి నుంచి తనదైన ముద్ర వేసుకుని బీజేపీని అధికారంలోకి తెస్తూ తాను ప్రధాని కావడం వరకు తెలిసిందే. ప్రస్తుత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లోనూ మోడీకి ఉన్న అనేక లక్షణాలు - అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయని చెబుతున్నారు.
    
మోడీ మాదిరిగానే యోగి కూడా పొలిటికల్ గా హెవీ వెయిట్ పర్సనాలిటీ. మోడీ మాదిరిగానే ఈయనా బ్రహ్మచారి. కుటుంబ జీవితం లేదు. అంతా ప్రజా జీవితమే. ఒక రకంగా చెప్పాలంటే ఈ విషయంలో మోడీ కంటే యోగే అధికుడు. మోడీ సన్యాసం స్వీకరించలేదు యోగి సన్యాసి. మోడీ మాదిరిగానే యోగి బ్రహ్మాండమైన మాస్ లీడర్. హిందూత్వకు పెద్ద ఐకాన్. ఆయన కనిపిస్తే ఓట్ల వర్షం కురుస్తుంది.. ఓటర్లను ఆకట్టుకోవడంలో దిట్ట. అన్నిటికీ మించి గొప్ప వక్త. మోడీకి ఉన్నట్లే ఈయనకూ పోలరైజింగ్ ఫిగర్ అన్న ముద్ర ఉంది. ఇద్దరిపైనా మత కల్లోలాల కేసులు రైలు దహనాల కేసులు ఉన్నాయి.
    
మోడీకి పార్టీ పెద్దల వద్ద ఎంత పట్టుందో.. అన్ని విభేదాలూ ఉన్నాయి. యోగిదీ అదే పరిస్థితి. ఆయన్ను వెనకేసుకొచ్చేవారూ ఉన్నారు. ఆయనతో ప్రమాదమనేవారూ ఉన్నారు. పార్టీతో దశాబ్దకాలం పాటు విభేదిస్తూనే పార్టీలో కొనసాగుతూ పార్టీ ఎదుగుదలకు పాటుపడిన చరిత్ర యోగిది. ఇది సామాన్యమైన ఫీట్ కాదు. సో... మోడీ లక్షణాలు.. మోడీ రాజకీయ చరిత్రకు.. యోగికి ఎన్నో పోలికలు కనిపిస్తున్నాయి. దీంతో బీజేపీకి యోగి భవిష్యత్తులో మోడీ మాదిరిగానే తురుపుముక్కగా నిలుస్తారని.. భవిష్యత్తులో ఆయన ప్రధాని పీఠం అధిరోహించే అవకాశాలూ ఉన్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/