Begin typing your search above and press return to search.

సూర్య‌గ్ర‌హణం వేళ ఊహించ‌నిది అడ్డు వ‌చ్చిందే

By:  Tupaki Desk   |   22 Aug 2017 10:27 AM GMT
సూర్య‌గ్ర‌హణం వేళ ఊహించ‌నిది అడ్డు వ‌చ్చిందే
X
సూర్య‌గ్ర‌హ‌ణం అన్న వెంట‌నే.. చిన్న‌ప్పుడు చ‌దువుకునే పాఠం చ‌ప్పున గుర్తుకు రావ‌టం కామ‌న్‌. భూమికి.. సూర్యుడినికి చంద్రుడు అడ్డుగా వ‌చ్చే వేళ‌ల్లో సూర్య‌గ్ర‌హ‌ణం ఏర్ప‌డుతుంద‌న్న‌ది తెలిసిందే. అయితే.. త‌న‌కు తాను తిరుగుతూ.. సూర్యుడు చుట్టూ తిరిగే వేళ‌లో.. భూమి ఏ ప్రాంతంవైపు ఉన్న‌ప్పుడు ఇది సంభ‌విస్తుందో ఆ ప్రాంతాల్లో మాత్ర‌మే సూర్య గ్ర‌హ‌ణం కానీ.. చంద్ర గ్ర‌హ‌ణం కానీ క‌నిపిస్తుంది.

ఆగ‌స్టు 21న సూర్య‌గ్ర‌హ‌ణం ఉన్నా.. అది అమెరికాలోని కొన్ని ప్రాంతాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైంది. భార‌త్‌కు ఎలాంటి ప్ర‌భావం లేన‌ప్ప‌టికీ.. అరుదుగా చోటు చేసుకునే గ్ర‌హ‌ణాల మీద పెద్ద ఎత్తున ఆస‌క్తి వ్య‌క్త‌మ‌వుతుంటుంది. తాజాగా చోటు చేసుకున్న గ్ర‌హ‌ణంలో ఎప్పుడూ ఊహించ‌ని ఒక ఘ‌ట‌న చోటు చేసుకుంది.

సూర్య‌గ్ర‌హ‌ణం ఏర్ప‌డిన స‌మ‌యంలో సూర్య‌డికి.. భూమికి మ‌ధ్య అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రం అడ్డుగా వ‌చ్చింది. ఈ ప‌రిణామాన్ని ఫోటో బాంబ‌ర్ గా పిలుస్తున్నారు. అరుదుగా ఏర్ప‌డే సూర్య‌గ్ర‌హాణాన్ని ప‌లువురు నిపుణులు త‌మ శ‌క్తివంత‌మైన కెమెరాలు.. ఫోన్ల‌లో ఫోటోలు.. వీడియోలు తీశారు. ఇలా తీసిన వారిలో ప‌లువురికి అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రం సూర్యుని ముందుగా వెళ్ల‌ట క‌నిపించింది. నాసా ఫోటోగ్రాఫ‌ర్ జోయెల్ కొయెస్కీ తీసిన ఫోటోలో అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రం సూర్యుడికి అడ్డుగా వెళ్ల‌టం స్ప‌ష్టంగా క‌నిపించింది. ఇదిప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లువురి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది.