Begin typing your search above and press return to search.

పాక్ మాట‌!..భార‌త్‌ పైకి అణ్వాయుధాలు రెడీ!

By:  Tupaki Desk   |   21 Sep 2017 11:04 AM GMT
పాక్ మాట‌!..భార‌త్‌ పైకి అణ్వాయుధాలు రెడీ!
X
భార‌త్‌ తో నిత్యం త‌గ‌వులాటే ల‌క్ష్యంగా సాగుతున్న దాయాదీ దేశం పాకిస్థాన్ నిజంగానే బ‌రి తెగించింద‌నే చెప్పాలి. ఎందుకంటే.. ఇప్ప‌టికే అమెరికాను స‌ర్వ నాశ‌నం చేస్తానంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్న ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ జాంగ్ ఉన్‌... యావ‌త్తు ప్ర‌పంచాన్ని తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేస్తున్నారు. ఈ క్ర‌మంలో పాక్ కూడా ఉత్త‌ర‌కొరియా మాదిరే... భార‌త్‌ పైకి దూసుకొచ్చేస్తామ‌న్న కోణంలో పాకిస్థాన్ ప్ర‌ధాని షాహిద్ ఖాక‌స్ అబ్బాసీ తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న అణ్వాయుధాల‌ను తాము త‌యారు చేశామ‌ని, వాటిని కేవ‌లం భార‌త్‌ పై వేయ‌డానికే రూపొందించామ‌ని ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న ఇప్పుడు నిజంగానే పెను సంచ‌ల‌నంగా మారింది.

అమెరికా మేథోసంస్థ కౌన్సిల్ ఆఫ్ ఫారిన్ రిలేషన్స్‌‌తో మాట్లాడిన సంద‌ర్భంగా అబ్బాసీ చేసిన ఈ ప్ర‌క‌ట‌న ఒక్క‌సారిగా ప్ర‌పంచ దేశాల‌ను విస్మ‌యానికి గురి చేశాయ‌నే చెప్పాలి. భారత్‌ ను ఎదుర్కొనేందుకే చిన్నతరహా అణ్వాయుధాలను తయారుచేశామని అబ్బాసీ కాస్తంత విస్ప‌ష్ట ప్ర‌క‌ట‌నే చేశారు. ఇంకా ఆయ‌న ఏమ‌న్నార‌న్న విష‌యానికి వ‌స్తే... *భారత్ రూపొందించిన ‘కోల్డ్ స్టార్ట్’ సిద్ధాంతాన్ని ఎదుర్కునేందుకు మేము స్వల్ప శ్రేణి అణు ఆయుధాలను తయారుచేశాం. మిగతా వ్యూహాత్మక ఆయుధాలను నియంత్రిస్తున్న కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థకే అణ్వాయుధాల నియంత్రణ బాధ్యతలు కూడా అప్పగించాం* అని అబ్బాసీ పేర్కొన్నారు.

అయినా ఉన్న‌ప‌ళంగా ఇంత‌టి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌ను అబ్బాసీ ఎందుకు చేశార‌న్న విస‌యానికి వ‌స్తే... పాకిస్తాన్‌ కు అణ్వాయుధాలను నిర్వహించగల సామర్థ్యంపై కౌన్సిల్ మోడరేటర్ డేవిడ్ సంగర్ సందేహాలు వ్యక్తం చేశారు. ఉత్తర కొరియా దగ్గర ఉన్నన్ని అణ్వాయుధాలు మరే దేశంలోనూ లేవనీ... అయితే వాటిని నిర్వహించగల సామర్థ్యం ఆ దేశానికి ఉందా అన్న దిగులే ఇప్పుడు అమెరికాను వెంటాడుతున్నదని గుర్తుచేశారు. అణ్వాయుధాలను నియంత్రించగల కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ గురించే అమెరికా ఆందోళన చెందుతున్నదన్నారు. దీనికి అబ్బాసీ స్పందిస్తూ ... ‘‘మా వ్యూహాత్మక అణు ఆయుధాలను పర్యవేక్షించేందుకు సురక్షితమైన కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ఉంది. ఇది ఎంతో రక్షణాత్మక వ్యవస్థ అని రుజువు అవుతూ వస్తోంది కూడా. పాకిస్థాన్‌ అణ్వాయుధ కమాండ్‌ సంస్థ (ఎన్‌సీఏ) నేతృత్వంలో పౌర పర్యవేక్షణ వాటి సాగుతోంది. న్యూక్లియర్ వ్యర్థాలను కూడా ఎలా నిర్వహించాలో మాకు తెలుసు’’ అని చెప్పుకొచ్చారు.