Begin typing your search above and press return to search.

అమెరికా బ్యాడ్‌ టైంః స్కూల్లో కాల్పులు...

By:  Tupaki Desk   |   14 Sep 2017 7:55 AM GMT
అమెరికా బ్యాడ్‌ టైంః స్కూల్లో కాల్పులు...
X
ఈ న‌గ‌రానికి ఏమైంది..అనే పాపుల‌ర్ ప్ర‌క‌ట‌న తెలియ‌ని వాళ్లు చాలా త‌క్కువ‌మంది ఉంటారేమో?! అందులోని సందేశం ఎంత మందికి చేరిందో కానీ...ఆ యాడ్ మాత్రం భ‌లే పాపుల‌ర్ అయిపోయింది. ఇంత‌కీ విష‌యానికి వ‌స్తే...ఇప్పుడు ఆ ప్ర‌క‌ట‌న‌ను కాస్త మార్చితే అమెరికాకు స‌రిగ్గా స‌రిపోతుంద‌ని కొంద‌రు అంటున్నారు. ఇంత‌కీ ఎలా అనేదే మీ సందేహ‌మా? అగ్ర‌రాజ్యం అమెరికాలో వ‌స‌తుల‌కేం కొద‌వ‌లేదనే సంగ‌తి తెలిసిందే క‌దా? కానీ ఆ దేశంలోనే..ఉక్క‌పోత‌తో ఎనిమిది మంది చ‌నిపోయారు!!

అమెరికాలోని ఫ్లోరిడాను ఇర్మా క‌ష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. తుపాను ధాటి త‌గ్గినా.. వ‌ర్షాలు - వ‌ర‌ద‌లు త‌గ్గుముఖం ప‌ట్టినా.. విద్యుత్ స‌మ‌స్య అక్క‌డ ప్ర‌జ‌ల‌ను తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. ఇంకా చాలా ప్రాంతాల్లో విద్యుత్ పున‌రుద్ద‌ర‌ణ జ‌ర‌గ‌లేదు. దీంతో ఫ్లోరిడాలోని ఓ ఆసుప‌త్రిలో ఎనిమిది మంది రోగులు మ‌ర‌ణించారు. ప‌వ‌ర్ లేక‌పోవ‌డంతో - ఏసీ ప‌నిచేయ‌క‌ తీవ్ర‌మైన వేడి కార‌ణంగానే వీళ్లు మ‌ర‌ణించి ఉంటార‌ని అనుమానిస్తున్నారు. వ‌ర‌ద ముంచెత్త‌డంతో అనేక చోట్ల జ‌న‌రేట‌ర్లు కాలిపోతున్నాయి. మియామి - డేటోనా బీచ్ ప్రాంతాల్లో జ‌న‌రేట‌ర్ల నుంచి విష‌వాయువులు వెలువ‌డి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మీద‌ ఇర్మా తుపాను ధాటికి అమెరికాలో 20 మంది మ‌ర‌ణించారు.

కాగా, వాషింగ్టన్‌ లోని ఓ పాఠశాలలో జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా - ఐదుగురు గాయపడ్డారు. దక్షిణ స్పొకేన్ లోని ఫ్రీమ్యాన్ హైస్కూల్ వద్ద ఈ ఘటన జరిగిందని, వెనువెంటనే పాఠశాలను మూసివేశామని యాజమాన్యం ట్విట్టర్‌ లో ప్రకటించింది. అప్రమత్తమైన అధికారులు సమీపంలోని అన్ని పాఠశాలలను ఖాళీ చేయించారు. అంబులెన్స్ - హెలికాప్టర్లు ఘటనాస్థలి వద్దకు చేరుకున్నాయి. నలుగురిపై కాల్పులు జరిగాయంటూ ఓ విద్యార్థి ట్విట్టర్‌ లో పోస్ట్‌ చేశారు. అమెరికాలోని పాఠశాలల్లో కాల్పుల ఘటనలు సర్వసాధారణం. 2013 నుంచి ఇప్పటివరకు అక్కడ 142 కాల్పుల ఘటనలు జరిగాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది.