సెక్స్ రాకెట్ : ఎఫ్.ఐ.ఆర్ లో షాకింగ్ నిజాలు

Tue Jun 19 2018 10:40:57 GMT+0530 (IST)

అమెరికాలో బయటపడిన చికాగో సెక్స్ రాకెట్ తెలుగు సినిమా ఇండస్ట్రీని కుదిపేసిన సంగతి తెలిసిందే.. ఈ రాకెట్ లో టాలీవుడ్ కో ప్రొడ్యూసర్ కిషన్ మోదుగుమూడి-చంద్రకళ దంపతులను అమెరికన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారిపై చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ చార్జిషీట్ లో దిమ్మదిరిగే వాస్తవాలు పొందుపరిచారు. ఈ దందాలో పలువురు తెలుగు - కన్నడ - హీరోయిన్లు పాలుపంచుకున్నారని.. కొందరు డబ్బు కోసం .. మరికొందరు బలవంతంగా ఈ రొంపిలోకి దిగినట్లు చార్జిషీట్ లో పేర్కొన్నారు.కిషన్-చంద్ర దంపతులు అమెరికాలో తెలుగు ఈవెంట్ల పేరుతో ఇక్కడకు రప్పించి గత కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారాన్ని నడిపినట్టి చార్జిషీట్ లో పేర్కొన్నారు.. ఈ వ్యవహారంలో బాధితురాలిగా ఉన్న హీరోయిన్ (విక్టమ్ -ఏ)పై అమెరికా ఐదేళ్ల నిషేధం విధించినట్లు సమాచారం.

విక్టిమ్-ఏగా ఉన్న సదురు హీరోయిన్ తెలుగు - కన్నడ చిత్రాల్లో నటించింది. డిసెంబర్ 26 - 2017న ఆమెకు మంజూరైన అమెరికా వీసాపై నిషేధం విధించారని.. మార్చిలో ఆమె అమెరికా వెళ్లిన తర్వాత ఈ విషయం తెలిసి షాకైనట్లు సమాచారం. అమెరికాలోకి ఆమెను అనుమతించకపోవడంతో ఆ రోజు ఎయిర్ పోర్టులో పడుకొని తిరిగి బెంగళూరు వచ్చిందట..

ఇక హైదరాబాద్ లో ఉన్న సదురు హీరోయిన్ ను యూఎస్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ అధికారులు సెక్స్ రాకెట్ విషయంలో ప్రశ్నించినట్లు తెలుస్తోంది. విచారణకు ఆమె తన లాయర్ తో కలిసి హాజరైనట్లు సమాచారం.  అయితే ఈ కేసులో ఆమె పేరు బయటకు రాకుండా చూస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ చికాగో సెక్స్ రాకెట్ కేసును అమెరికా పోలీసులు సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు నమోదైన ఎఫ్.ఐ.ఆర్ ను బట్టి తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న కిషన్-చంద్ర దంపతులను ఇప్పటికే అరెస్ట్ చేసి ఇల్లినాయిస్ కోర్టులో ప్రవేశపెట్టిన అధికారులు వివిధ కోణాల్లో విచారణ జరిపిస్తున్నారు. ఇందులో ఇంకా ఎవరి ఇన్ వాల్వ్ మెంట్ ఉందనే విషయాలపై  కూపీ లాగుతున్నారు.

ఇక చికాగో సెక్స్ రాకెట్ పై తాము విచారణ చేయడం లేదని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఓ ఆంగ్ల మీడియా ప్రతినిధులతో ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. దీన్ని బట్టి తెలంగాణ పోలీసులతో సంబంధం లేకుండా అమెరికా పోలీసులు హైదరాబాద్ లో తమ విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.