Begin typing your search above and press return to search.

మోడీని మాటలనే మొనగాడు శివాజీ మాత్రమేనా?

By:  Tupaki Desk   |   30 April 2016 7:15 AM GMT
మోడీని మాటలనే మొనగాడు శివాజీ మాత్రమేనా?
X
దేశ ప్రధానిగా మోడీ మీద విమర్శలు చేసే వారు పెద్దగా కనిపించరు. మేనేజ్ మెంట్ గురు మాదిరి మోడీ చెప్పే మాటలు వినేందుకు కమ్మగా.. హాయిగా ఉంటాయి. కానీ.. ఆయన మాటలు చెప్పినంత తియ్యగా చేతల్లో ఏమీ చేసిపెట్టరన్న విషయం సీమాంధ్రప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. విభజన కారణంగా ఏపీకి జరిగిన అన్యాయాన్ని తాను సరిచేస్తానని మాటలు చెబితే.. నిజమే కదా అని అమాయకంగా నమ్మేసిన సీమాంధ్ర ప్రజలకు షాకిస్తూ.. ఉత్త చేయి చూపిస్తున్నవైనం తెలిసిందే. తాజాగా కేంద్ర సహాయమంత్రి ఒకరు ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదనే మాటను చెప్పేసి.. ఏపీ ప్రజలు పెట్టుకున్న ఆశల మీద నీళ్లు పోసేశారు. ఏపీకి ప్రత్యేక హోదా లేదని తేల్చి చెప్పిన తర్వాత అటు అధికారపక్షమైన తెలుగుదేశం పార్టీ నేతలుకానీ.. అటు ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు కానీ పెద్దగా స్పందించింది లేదు.

ఇక.. ఏపీ బీజేపీ నేతల గురించిచెప్పాల్సిన అవసరం లేదు. యూపీఏ సర్కారు హయాంలో ఏపీ కాంగ్రెస్ నేతలు పోషించిన పాత్ర తరహాలోనే నేడు బీజేపీ నేతలు అలాంటి వైఖరినే అనుసరిస్తున్న పరిస్థితి. సొంత ప్రాంత ప్రజల ప్రయోజనాల కంటే కూడా అధినాయకత్వం మీద భయభక్తుల్ని ప్రదర్శిస్తూ.. అనవసరమైన విధేయతను చాటాలన్న తపన మాత్రమే వారిలో కనిపిస్తోంది. ఇక.. మిగిలింది కాంగ్రెస్ నేతలు. వారే కనుక సరిగా ఉండి ఉంటే.. ఈ రోజున ఇలాంటి దరిద్రపు పరిస్థితులు వచ్చేవే కావు. వీటన్నింటిని చూసినప్పుడు అనిపించేది ఒక్కటే. ఒక ప్రాంత ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే ఏదో ఒక రాజకీయ పార్టీ గొంతు విప్పి పోరాడుతుంది. అందుకు భిన్నమైన పరిస్థితి ఏపీలో నెలకొని ఉండటం చూస్తే ఏపీ ప్రజలు ఎంత దురదృష్టవంతులో ఇట్టే అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సినీనటుడు.. విభజన నాటి నుంచి రాజకీయాల్ని ఎక్కువగా మాట్లాడుతున్న శివాజీ మరోసారి గళం విప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా లేదంటూ కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఆయన ఏ స్థాయిలో వ్యాఖ్యలు చేశారో చూస్తే..

= ఇప్పుడంతా చంద్రబాబు చేతుల్లోనే ఉంది. మొన్న కూడా చంద్రబాబు మాట్లాడుతూ.. అమ్మ పెట్టదు.. అడుక్కుతిననివ్వదన్నారు. ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రం ఎలా వ్యవహరిస్తుందో కేంద్రమంత్రి మరోసారి తన వ్యాఖ్యలతో చెప్పేశారు.

= ఏపీకి చేయాల్సిన సాయం గురించి మాట్లాడితే 14వ ఆర్థిక సంఘం అంటూ బీజేపీ సన్నాసులు ఏదేదో చెబుతున్నారు. 14వ ఆర్థిక సంఘం బీహార్ కు 1.60లక్షల కోట్లు ఇవ్వమందా సన్నాసుల్లారా? మీరు మనుషులేనా?

= తెలంగాణ సాధన కోసం ఆ రోజున ఇద్దరే ఇద్దరు (కేసీఆర్.. విజయశాంతి) ఎంపీలు లోక్ సభను సాగకుండా అడ్డుపడ్డారు. తెలంగాణను సాధించుకున్నారు. కానీ.. ఏపీకి ప్రత్యేక హోదా విషయమైన రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు.. బీజేపీ ఎంపీలు నోరు మెదపటం లేదు.

= ఏపీ ప్రత్యేక హోదా విషయమైన వెంకయ్యనాయుడు.. సుజనా చౌదరి.. రాష్ట్రానికి చెందిన టీడీపీ.. బీజేపీ నేతలు ఏం చేస్తున్నట్లు..?

= మనసు విప్పి పోరాటం చేస్తే ప్రత్యేక హోదా రాకుండా ఎందుకు ఉంటుంది?

= ఇప్పుడు మాట్లాడుతున్న ఏపీ కాంగ్రెస్ నేతలు.. విభజన బిల్లును పెట్టినప్పుడే నోరు విప్పి ప్రత్యేక హోదాను బిల్లులో పెట్టిస్తే ఈ రోజు ఈ దరిద్రం ఉండేది కాదు

= ఏపీ ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు తప్పించి మరే మంత్రి మాట్లాడింది లేదు. బీజేపీతో ఉన్న బంధాన్ని చంద్రబాబు తెంచుకోవాలి.

= మన ప్రధాని గురించి మాట్లాడుకోవటానికి మనకు సిగ్గు ఉండాలి. ఆయన కేవలం ఆర్టిఫీషియల్ ప్రధాని. ప్రాక్టికల్ ప్రధాని కాదు.

= ఏపీ అంటే మోడీకి కక్ష. ముఖ్యంగా చంద్రబాబు అంటే ఆయనకు కసి. పిచ్చి వ్యూహాలు.. రాజకీయ కుయుక్తులు పన్నుతున్నారు. మోడీకి దెబ్బ తగలటం ఖాయం.

= ఎవరైతే బీజేపీ తరఫున వెళతారో వారికి డిపాజిట్లు కూడా రావు. బీజేపీ నుంచి బయటకు వచ్చి టీడీపీ నేతలు కేంద్రం మీద ఎదురుదాడి చేయాలి. ఏపీకి ప్రతి విషయంలోనూ అన్యాయమే జరుగుతోంది.