Begin typing your search above and press return to search.

మిత్రుడి క‌క్కుర్తిని క‌డిగేసిన శివ‌సేన‌

By:  Tupaki Desk   |   21 March 2019 11:33 AM GMT
మిత్రుడి క‌క్కుర్తిని క‌డిగేసిన శివ‌సేన‌
X
స్నేహితుడు త‌ప్పు చేస్తే వెన‌కేసుకురావాలా? వారి త‌ప్పుల్ని భుజాన వేసుకొని స‌మ‌ర్థిస్తూ ఉండాలా? మిగిలిన పార్టీలు అలా చేస్తాయేమో కానీ శివ‌సేన మాత్రం ఎప్పుడూ అలా చేయ‌ద‌న్న విష‌యాన్ని తాజాగా మ‌రోసారి నిరూపించింది. తాజాగా త‌న మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ క‌క్కుర్తిని ఉద్దేశించి ఘాటుగా ప్ర‌శ్నించ‌ట‌మే కాదు.. క‌క్కుర్తిని క‌డిగిపారేసింది. సీఎం కుర్చీ కోసం మ‌రీ ఇంత‌లా దిగ‌జారాలా? అంటూ విరుచుకుప‌డింది.

మిత్ర‌ప‌క్షంగా సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న శివ‌సేన‌.. తాజాగా గోవాలో చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాలు.. వీటిపై బీజేపీ అనుస‌రించిన విధానాల్ని త‌ప్పు ప‌ట్టింది. గోవా సీఎం మ‌నోహ‌ర్ పారిక‌ర్ ఛితాభ‌స్మం చ‌ల్లార‌క‌ముందే బీజేపీ సీఎం కుర్చీ కోసం రాజ‌కీయాల్ని చేయ‌టాన్ని త‌ప్పు ప‌ట్టింది. ప్ర‌జాస్వామ్యంలో ఒక రాష్ట్రం గ‌డ్డు ప‌రిస్థితి ఇది నిద‌ర్శ‌న‌మ‌ని వ్యాఖ్యానించిన శివ‌సేన‌.. పారిక‌ర్ ఆస్తిక‌లు బూడిదై.. చ‌ల్లారే వ‌ర‌కు కూడా ఆ పార్టీ నేత‌లు ఆగ‌లేద‌ని మండిప‌డింది.

రిసార్టు రాజ‌కీయాల‌కు తెర తీసి త‌న నైజాన్ని నిరూపించుకుంద‌ని క‌డిగిపారేసింది. పారిక‌ర్ మ‌ర‌ణం త‌ర్వాత అధికారం కోసం బీజేపీ చేసిన చేష్ట‌లు చూస్తే ఆధికారం కోసం వికృత క్రీడ ఆడిన‌ట్లుగా ఉంద‌ని నిప్పులు చెరిగింది. పారిక‌ర్ ఛితాభ‌స్మం భూమిలో ఇంక‌క ముందే బీజేపీ చ‌ర్య హేయ‌నీయంగా అభివ‌ర్ణించిన శివ‌సేన త‌న ప‌త్రిక సామ్నా ఎడిటోరియ‌ల్ లో నిప్పులు చెరిగింది.

గోవా అధికార పీఠం కోసం బీజేపీ రెండు రోజులు ఆగి ఉంటే బాగుండేద‌ని పేర్కొంది. అలా చేసి ఉంటే బీజేపీ నేత‌లు కాంగ్రెస్ లో చేరిపోయేవారా? అని ప్ర‌శ్నించిన సామ్నా.. అర్థ‌రాత్రి వేళ సీఎం.. డిప్యూటీ సీఎంల ప్ర‌మాణ‌ స్వీకారం ఏమిట‌ని నిల‌దీసింది. వికృత క్రీడ‌ను తెర తీసింద‌న్న సామ్నా.. మాజీ ర‌క్ష‌ణ శాఖ మంత్రి మ‌ర‌ణిస్తే కేంద్రం సంతాపం ప్ర‌క‌టించింది. కానీ గోవాలో మాత్రం సంతాపం దేవుడికెరుగన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించింద‌ని వ్యాఖ్యానించింది. గోవాకు ముఖ్య‌మంత్రిగా సేవ‌లు అందించిన పారిక‌ర్ కు గౌర‌వ‌సూచ‌కంగా జాతీయ జెండాను అవ‌త‌నం చేయాల‌న్న సోయి కూడా గోవా ప్ర‌భుత్వానికి లేదంది. మిత్రుడే అయిన‌ప్ప‌టికీ.. త‌ప్పులు చేస్తే ఉపేక్షించాల్సిన అవ‌స‌రం లేద‌న్న విష‌యాన్ని శివ‌సేన త‌న తాజా తీరుతో స్ప‌ష్టం చేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.