Begin typing your search above and press return to search.

కొత్త ట్విస్టు: షీనా అమెరికాలో ఉందట!

By:  Tupaki Desk   |   1 Sep 2015 10:03 AM GMT
కొత్త ట్విస్టు: షీనా అమెరికాలో ఉందట!
X
అద్భుతమైన ట్విస్టులు, జలక్కులు... రోజు రోజుకీ ట్విస్టు మీద ట్వీస్ట్ లు ఇస్తున్న షీనాబోరా హత్యా కేసులో తాజాగా ఒక కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఇంద్రాణికి కూతురు షీనాబోరా అని తెలియడం మొదలు కొత్త కొత్త షాక్ లు ఇస్తూనే ఉంది ఈ కేసు! ఈ కేసుకు సంబందించి ఇంద్రాణి ముఖర్జియాను విచారిస్తున్న పోలీసులకు రోజుకో కొత్త కోణం బయటకు వస్తుంది! ఇదే ట్విస్టులకు కంటిన్యూ చేస్తూ... తాజాగా "షీనాబోరా బ్రతికే ఉందని, ప్రస్తుతం అమెరికాలో ఉంటోందని.. కేవలం తనపై పెంచుకున్న ద్వేషం కారణంగానే దూరంగా ఉంటుందని" ఇంద్రాణీ చెప్పినట్లు సమాచారం! "నా బిడ్డ షీనాను చంపలేదు.. బ్రతికే ఉంది" అని ఇంద్రాణి చెప్పిండంతో.. పోలీసులు తలలు పట్టుకుంటున్నారట!

ఇంద్రాణీ మాటలు నమ్మలా వద్దా అనే మీమాంసలో ఉన్న పోలీసుల మదిలో ఎన్నో ప్రశ్నలు మెదులుతున్నాయట. నిజంగానే షీనా బ్రతికేవుందా? లేక ఇంద్రాణి కావాలనే కేసును తప్పుదోవ పట్టిస్తూ నాటకాలాడుతుందా? అనే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారట పోలీసులు! దీంతో షీనా హత్యకు గురైంది అని చెబుతున్న రోజు నుండి అమెరికా వెళ్లిన ప్రతీ ప్రయాణికుడి డేటాను సేకరించే పనిలో పడ్డారు పోలీసులు.

అయితే ఇన్నాళ్లూ రకరకాల డ్రామాలాడిన ఇంద్రాణీ... ఈ విషయాన్ని ఇప్పటివరకూ ఎందుకు దాచినట్లో పోలీసులకు అంతుచిక్కడం లేదు. అయితే షీరా బోరాను ఇంద్రాణే చంపిందని షీనా సోదరుడు చెప్పిన సంగతి తెలిసిందే! రోజుకో మలుపు తిరుగుతున్న ఈ కేసు మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి మరి!