Begin typing your search above and press return to search.

మీటూ బాధితుడే అయినా అతనితో కలిసి పనిచేస్తా!!

By:  Tupaki Desk   |   19 Oct 2018 9:34 AM GMT
మీటూ బాధితుడే అయినా అతనితో కలిసి పనిచేస్తా!!
X
బాలీవుడ్ - రాజకీయ రంగాల్లో ప్రముఖుల్లో ఒక్కొక్కరుగా ‘మీ టూ’ ఉద్యమ బారిన పడుతున్నారు. బాధితులు ధైర్యంగా ముందుకు రావాలని కొంతమంది చేయి చేయి కలుపుతుండగా - అసలు ఇది కరెక్ట్ విధానం కాదని ఇంకొంత మంది విమర్శిస్తున్నారు. అటువంటి వారిలో ఇప్పుడు సీనియర్ నటుడు శత్రుఘ్ను సిన్హా వచ్చి చేరారు.

మీటూ ఉద్యమంపై సీనియర్ నటుడు శత్రుఘ్ను సిన్హా స్పందించారు. 42 ఏళ్ల కెరీర్లో ఎన్నడూ తప్పు చేయలేదని అన్నారు. ఎవరికైనా అన్యాయం జరిగిందని భావిస్తే పోలీస్ స్టేషన్ కు వెళ్లాలి లేదా కోర్టుకు వెళ్లాలి. ఇష్టమొచ్చినట్లు ఒకరిపై కామెంట్లు చేయడం సరికాదని పేర్కొన్నారు.

ఇప్పటికే బాలీవుడ్ దర్శకులు సాజిద్ - సుభాష్ ఘయ్ - సుభాష్ కపూర్ వంటి ప్రముఖ దర్శక నిర్మాతలు మీటూ ఉద్యమంలో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి వారితో కలిసి పనిచేయమని అగ్ర తారలు అమీర్ ఖాన్ - అక్షయ్ కుమార్ వంటి వారు తేల్చి చెప్పారు. జర్నలిస్ట్ ఎంజీ అక్బర్ తన రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది.

కాగా, శత్రుఘ్నుసిన్హా మాట్లాడుతూ - మీటూ ఉద్యమం పేరుతో సీనియర్లపై ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఒకరి పరువుకు భంగం వాటిల్లేలా మాట్లాడటం సరికాదని చెప్పారు. లైంగికంగా వేధిస్తున్నారు.. వేధించారన్నది కేవలం ఆరోపణ మాత్రమే.. వారితో కలిసి పనిచేయకూడదని నిర్ణయం తీసుకోవడం సరికాదని అన్నారు. తన స్నేహితుడు సుభాష్ ఘయ్ కూడా మీటూ బాధితుడే. అయినా, అతనితో కలిసి పనిచేస్తా.. అని చెప్పారు సిన్హా. అతను తప్పు చేయలేదని నాకు విశ్వాసం ఉంది.. ఒకవేళ చేసినా కూడా అతనితోనే ఉంటానని అన్నారు.

ఏది ఏమైనా బాలీవుడ్ ను కుదిపేస్తున్న మీటూ ఉద్యమం ఎటువైపునకు దారి తీస్తుందో వేచి చూడాలి.