Begin typing your search above and press return to search.

న‌న్ను ప్ర‌ధానిని చేయ‌కండని వేడుకుంటున్నాడు

By:  Tupaki Desk   |   20 March 2017 8:14 AM GMT
న‌న్ను ప్ర‌ధానిని చేయ‌కండని వేడుకుంటున్నాడు
X
ఒక్కోసారి ప్ర‌చారం సైతం ఎంత ఇబ్బందిక‌రంగా మారుతుందో తెలుసుకోవాలంటే ఐక్యరాజ్య సమితి మాజీ దౌత్యాధికారి, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ను అడిగి తెలుసుకోవాలి. గ‌త కొద్దికాలంగా సామాజిక మాధ్య‌మ దిగ్గ‌జం అయిన ఫేస్ బుక్ ఒక ప్ర‌చారం సాగుతోంది. అందేంటంటే.... వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ ప్రధానమంత్రి అభ్యర్థిగా శ‌శిథ‌రూర్‌ ను ప్ర‌తిపాదిస్తున్నాం. దీనికి మ‌ద్ద‌తు తెలిపే వారు త‌మ సంఘీభావం తెల‌పండి అని. ఈ క్యాంపెయిన్ వైర‌ల్ కావ‌డంతో శ‌శిథ‌రూర్ స్పందించారు. ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌వికి తన పేరును ప్రతిపాదిస్తూ ఫేస్‌బుక్‌లో సాగుతున్న ప్రచారాన్ని ఖండించారు.

కాంగ్రెస్ త‌ర‌ఫున తిరువనంతపురం నుంచి ఎంపీగా ఉన్న థ‌రూర్ ఈ ప‌రిణామంపై రియాక్ట్ అవుతూ ఈ ప్రచారం వెనుక ఉన్న వ్యక్తులు దాన్ని నిలిపివేయాలని ఫేస్‌ బుక్‌ లో ఉంచిన ఓ మెస్సేజ్‌ లో కోరారు. ఇలాంటి ప్రచారానికి తన మద్దతు కానీ, ఆమోదముద్ర కానీ లేవని ఆయన అన్నారు. ఈ పిటిషన్‌ను సృష్టించిన వారికి, ఇప్పటిదాకా దీనిపై సంతకాలు చేసిన వారికి శ‌శిథ‌రూర్‌ కృతజ్ఞతలు తెలియజేస్తూ, అయితే ఈ ప్రచారానికి తన మద్దతు ఎంతమాత్రం లేదని అన్నారు. తాను పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఎంపీని మాత్రమేనని, అంతకుమించి ఏమీ కాదని శ‌శిథ‌రూర్‌ అన్నారు. తమ పార్టీకి ఒక నాయకత్వం ఉందని, మార్పులు ఒక పద్ధతి ప్రకారం జరుగుతాయని చెప్పారు. దేశం కోసం, తన నియోజకవర్గం కోసం పార్లమెంటులో తన శక్తి మేరకు కృషి చేస్తానని శ‌శిథ‌రూర్ పేర్కొన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/