Begin typing your search above and press return to search.

బాబును అంతమాట అనేసి షర్మిల

By:  Tupaki Desk   |   13 Oct 2015 7:52 AM GMT
బాబును అంతమాట అనేసి షర్మిల
X
ఏపీ అధికారపక్షానికి.. విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతునన్న విషయం తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా కోసం నిరవధిక దీక్ష చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ను మంగళవారం తెల్లవారుజామున బలవంతంగా ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఈ సందర్భంగా జగన్ వదిలిన బాణం షర్మిలమ్మ.. ఏపీ ముఖ్యమంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

నిరవధిక దీక్ష చేసిన జగన్ శరీరంలో యూరిక్ యాసిడ్ చాలాఉందని వైద్యులు చెప్పారన్న షర్మిల.. చంద్రబాబు లాంటి మనిషి గురించి ఏం మాట్లాడుతామంటూ మండిపడ్డారు. 24 గంటల పాటు జగన్ ను ఆహారం తీసుకోకూడదని వైద్యులు చెప్పారన్నారు. జగన్ చేసిన దీక్షతో చంద్రబాబు ఆత్మరక్షణలో పడ్డారన్న షర్మిల.. ఏపీకి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు దీక్ష చేయాల్సి ఉందని.. కానీ జగన్ చేశారన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా కోసం దీక్ష చేసిన జగన్ ను అభినందించాల్సింది పోయి.. తన మంత్రుల చేత హీనాతిహీనంగా వ్యాఖ్యలు చేయించారన్న షర్మిల మండిపడ్డారు. ‘‘అలాంటి హీనమైన పనులు చేయించిన మనిషి గురించి ఏం మాట్లాడుతాం’’ అంటూ ఫైర్ అయ్యారు. దీక్ష ను భగ్నం చేయటంతోనే జగన్ పోరాటం ఆగదని.. త్వరగా కోలుకొని ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగిస్తారని చెప్పారు