Begin typing your search above and press return to search.

శ‌ర‌ద్ యాద‌వ్‌ ను వెనుక బెంచీకి పంపారు

By:  Tupaki Desk   |   13 Aug 2017 4:18 AM GMT
శ‌ర‌ద్ యాద‌వ్‌ ను వెనుక బెంచీకి పంపారు
X
రాజ‌కీయాల్లో ఏది చూసుకున్నా చూసుకోకున్నా టైమ్ ను.. టైమింగ్ విష‌యంలో మాత్రం చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఈ రెండింటిలో ఏది మిస్ అయినా దానికి చెల్లించాల్సిన మూల్యం భారీగా ఉంటుంది. ఇప్పుడా విష‌యం.. జ‌నతాద‌ళ్ (యునైటెడ్‌) సీనియ‌ర్ నేత శ‌ర‌ద్ యాద‌వ్‌కు చాలా బాగా అర్థ‌మైంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. కాలం పోక‌డ తెలీక.. నితీశ్ బాట‌లో న‌డ‌వ‌కుండా వేరు కుంప‌టి ఆలోచ‌న‌ల్లో ఉన్న శ‌ర‌ద్ యాద‌వ్‌కు తాజాగా ఊహించ‌ని షాక్ త‌గిలింది.
మోడీ అండ్ కోతో చేతులు క‌లిపి.. 24 గంట‌ల్లోపే త‌న సీఎం ప‌ద‌వికి రాజీనామా చేసి.. మ‌ళ్లీ సీఎం కావ‌టం తెలిసిందే.'

నితీశ్ విష‌యంలో మోడీ అండ్ కో వేసిన ప్లానింగ్‌ కు అశేష భార‌తావ‌ని ఒక్క‌సారి అవాక్కైన ప‌రిస్థితి. అలాంటి వేళ‌.. కేర్ ఫుల్ గా ఉండాల్సిన శ‌ర‌ద్ యాద‌వ్‌.. నితీశ్ తో పెట్టుకోవ‌టానికి సిద్ధం కావ‌ట‌మే కాదు.. పార్టీని చీల్చేందుకు సైతం వెనుకాడ‌న‌న్న‌ట్లుగా సంకేతాలు ఇస్తున్నారు.

ఇలాంటివేళ‌.. కాస్త అడ్వాన్స్ అయిన నితీశ్ కార‌ణంగా శ‌ర‌ద్ యాద‌వ్‌కు ఊహించ‌ని షాక్ తగిలింది. త‌న‌తో గేమ్ షురూ చేసిన సీనియ‌ర్ నేత‌కు నితీశ్ త‌న‌దైన శైలిలో షాకిచ్చారు. నిన్న‌టి వ‌ర‌కూ జేడీయూ ప‌క్ష నేత‌గా రాజ్య‌స‌భ‌లో ఒక వెలుగు వెలిగిన శ‌ర‌ద్ యాద‌వ్‌ కున్న ఆ పోస్టును పీకేసిన నితీశ్‌.. ఆయ‌న స్థానంలో పార్టీకి చెందిన రామ‌చంద్ర ప్ర‌సాద్ సింగ్ కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

దీంతో.. జేడీయూ ప‌క్ష నేత‌గా ఉన్న శ‌ర‌ద్ యాద‌వ్ వెనుక బెంచీల‌కు వెళ్లాల్సి ఉండ‌గా.. ఆయ‌న స్థానంలో రామ‌చంద్ర ప్ర‌సాద్ మొద‌టి బెంచీకి ప్ర‌మోట్ కానున్నారు. ఇటీవ‌ల చోటు చేసుకున్న వ్య‌వ‌హారాల‌పై నితీశ్ విష‌యంలో తీవ్ర అసంతృప్తి ఉన్న శ‌ర‌ద్ యాద‌వ్‌.. ఆయ‌న‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇలాంటి వేళ ప్ర‌త్య‌ర్థిది పైచేయి కావ‌టం కంటే.. తానే ఒక అడుగు ముందుకు వేయాల‌ని అనుకున్నారో కానీ నితీశ్ తాజాగా క‌దిపిన పావులతో శ‌ర‌ద్ యాద‌వ్ కు భారీ షాక్ ఇచ్చారు.

నితీశ్ సార‌థ్యంలోని జేడీయూ తీసుకున్న తాజా నిర్ణ‌యంతో శ‌ర‌ద్ యాద‌వ్ ముందు బెంచీల నుంచి వెన‌క్కి బెంచీల‌కు వెళ్లాల్సి వ‌చ్చింది. అంతేనా.. ఇప్ప‌టివ‌ర‌కూ జేడీయూ ప‌క్ష నేత‌గా ప‌లు కీల‌క అంశాల్ని ప్ర‌స్తావించ‌టంలోనూ.. చ‌ర్చ‌లో పాల్గొనే హ‌క్కు ఆయ‌న‌కు ఉండేది. ఇక‌పై అలాంటి అవ‌కాశం శ‌ర‌ద్ యాద‌వ్‌కు ఉండ‌దు. తాజాగా నెల‌కొన్ని మార్పుల నేప‌థ్యంలో ఇప్పుడు ఆయ‌న ఏదైనా మాట్లాడాల‌నుకుంటే ముందుగా అనుమ‌తి తీసుకోవాల్సి ఉంటుంది.

త‌న‌కుస‌మ‌యాన్నికేటాయించాల్సిందిగా రిక్వెస్ట్ చేసుకుంటే కానీ.. మైకు ఆయ‌న‌కు రాని ప‌రిస్థితి. నిన్న‌టి వ‌ర‌కూ ఒక వెలుగు వెలిగిన శ‌ర‌ద్ యాద‌వ్ లాంటోళ్ల‌కు తాజా ప‌రిణామాలు ఏమాత్రం మింగుడుప‌డే ఛాన్స్ లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇంత జ‌రిగిన త‌ర్వాత కూడా శ‌ర‌ద్ యాద‌వ్ జేడీయూలో కొన‌సాగుతారా? లేక‌.. కొత్త పార్టీ పెడ‌తారా? అన్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింద‌ని చెప్పక త‌ప్ప‌దు.