Begin typing your search above and press return to search.

నితీష్ కు అస‌మ్మ‌తి సెగ‌లు?

By:  Tupaki Desk   |   27 July 2017 12:36 PM GMT
నితీష్ కు అస‌మ్మ‌తి సెగ‌లు?
X
బిహార్ రాజ‌కీయాలు ర‌స‌కందాయంలో ప‌డ్డాయి. అనూహ్యంగా క్ష‌ణానికో మ‌లుపు తిరుగుతున్నాయి. సినీ డ్రామాను త‌ల‌పించే ప‌రిణామాలు బిహార్ లో జ‌రుగుతున్నాయి. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ‌స్వీ యాద‌వ్ పై అవినీతి ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఆర్జేడీ-జేడీయూ ల మ‌ధ్య విభేదాలు త‌లెత్త‌డంతో బిహార్ లో ఈ రాజ‌కీయ చ‌ద‌రంగం మొద‌లైంది. తేజ‌స్వీ మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయాల్సిందేన‌ని సీఎం నితీష్ కుమార్ కోరినా లాలూ స‌సేమిరా అనడంతో నితీష్ మ‌హా సంఘ‌ట‌న్ నుంచి త‌ప్పుకున్నారు. సీఎం ప‌ద‌వికి రాజీనామా చేసిన త‌ర్వాత‌ 24 గంట‌లు తిర‌గ‌కుండానే బీజేపీ మ‌ద్ద‌తుతో మ‌రోసారి ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. అయితే, బీజేపీతో నితీష్ చేతులు క‌ల‌పడం జేడీయూలో కొంత‌మంది నేత‌ల‌కు ఇష్టం లేదు. దీంతో, జేడీయూలో అస‌మ్మ‌తి రాగం వినిపిస్తోంది. జేడీయూ అస‌మ్మ‌తి నేత‌లు - ఆర్జేడీ - కాంగ్రెస్ తో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

బీహార్ రాజకీయాలు కొత్త మ‌లుపు తిరిగాయి. మోదీ - నితీష్ దెబ్బ‌కు లాలూ అయోమ‌యంలో ప‌డ్డార‌ని అంద‌రూ భావించారు. అయితే, నితీష్ కుమార్ వైఖరిపై జేడీయూలో అసమ్మతి రాజుకోవ‌డంతో నితీష్ డిఫెన్స్ లో ప‌డ్డ‌ట్ల‌యింది. ఏకంగా జేడీయూ అధినేత శరద్ యాదవ్ నేతృత్వం లో ఆ పార్టీ ఎంపీలు ఏఐసీసీ ఉపాథ్యక్షుడు రాహుల్ గాంధీని క‌ల‌వ‌డంతో బీహార్ రాజ‌కీయాలు ఒక్క‌సారిగా వేడెక్కాయి. జేడీయూ-బీజేపీ మైత్రిని కొందరు జేడీయూ ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీతో జట్టు కట్టడం తమకు ఇష్టం లేదని, కలిసి వస్తే ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామంటూ రాహుల్ తో శ‌ర‌ద్ యాద‌వ్ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అధికార పక్షాన్ని ఏకం చేస్తూ, విపక్షాన్ని చీల్చేందుకు నితీష్ కుమార్ రంగం సిద్ధం చేసుకోగా, బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ ఏకం చేస్తూ, ఇండిపెండెంట్లను కలుపుకుని, ఆర్జేడీని చీల్చి అధికారపగ్గాలు చేపట్టే బాధ్యతను లాలూ భుజాన వేసుకున్నారు.

మ‌రోవైపు, నితీష్ పై లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ నిప్పులు చెరుగుతున్నారు. గాడ్సేకు గుడి క‌ట్టాల‌నుకుంటున్న బీజేపీ ప్ర‌భుత్వంతో నితీష్ చేతులు క‌లిపార‌ని దుయ్య‌బ‌ట్టారు.గాంధీని చంపిన గాడ్సేకు గుడికట్టాలని నరేంద్రమోదీ ప్రయత్నిస్తున్నారని, అలాంటి బీజేపీతో నితీష్ కుమార్ చేతులు కలిపారని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ఆ రోపించారు. బిహార్ అసెంబ్లీలో తమకు మెజారిటీ ఉన్నప్పటికీ గవర్నర్ పట్టించుకోకుండా నితీష్ ను ప్రభుత్వం ఏర్పాటుకు పిలిచారన్నారు. ఎల్లుండి జరిగే విశ్వాస పరీక్షలో ఆయన ఓటమి ఖాయమని లాలూ అన్నారు.

కాగా, నితీష్ పై ఏఐసీసీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. బీజేపీతో చేతులు కలిపిన జేడీయూ అధినేత నితీశ్‌కుమార్‌పై కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మండిపడ్డారు. నితీశ్‌ కుమార్‌ తమను మోసం చేశాడని దుయ్యబట్టారు. 'నితీశ్‌ మళ్లీ ఎన్డీయేలో చేరాలని ప్రయత్నిస్తున్న విషయం మూడు - నాలుగు నెలల కిందటే మాకు తెలిసు. అప్పటినుంచే ఆయన మంతనాలు జరుపుతున్నారు. తమ స్వార్థం కోసం కొందరు ఏమైనా చేస్తారు. నితీశ్‌కుమార్‌ మమల్ని మోసం చేశారు' అని రాహుల్‌ ఫైర్‌ అయ్యారు.