Begin typing your search above and press return to search.

సోనియా కుడిభుజానికి కాంగ్రెస్ నేతలే షాకిస్తార‌ట‌

By:  Tupaki Desk   |   23 July 2017 5:31 AM GMT
సోనియా కుడిభుజానికి కాంగ్రెస్ నేతలే షాకిస్తార‌ట‌
X
ఇటీవ‌లి కాలంలో ప‌లు రాష్ర్టాల్లో పట్టు కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీకి మ‌రో షాక్ త‌గ‌ల‌నుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అందులోనూ ఏకంగా పార్టీ ర‌థ‌సార‌థి సోనియాగాంధీ కుడి భుజానికే దిమ్మ‌తిరిగి బొమ్మ క‌న‌ప‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. అత్యంత ఆస‌క్తిక‌రంగా కాంగ్రెస్ పార్టీలో నెల‌కొన్న అంత‌ర్గ‌త ప‌రిణామాలు ఈ షాకింగ్ సీన్‌ కు కార‌ణమ‌ని చెప్తున్నారు. గుజరాత్‌ లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శంకర్‌ సింగ్ వాఘేలా పార్టీకి రాజీనామా చేయటంతో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ రాజ్యసభకు తిరిగి ఎన్నిక కావటం అసాధ్యంగా మారింది. చింత్రంగా ఇందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కార‌ణం అవుతుండ‌టం విశేషం.

గుజరాత్ నుండి రాజ్యసభకు ఎన్నికైన అహ్మద్ పటేల్ ప్రస్తుత సభ్యత్వం వచ్చే నెల 18తో ముగుస్తోంది. గుజరాత్ నుండి మూడు ఖాళీలు ఏర్పడుతుంటే ఇందులో రెండు సీట్లను బీజేపీ సునాయాసంగా గెలుచుకుంటుంది. మూడో సీటుకు కాంగ్రెస్-బీజేపీల మధ్య పోటీ ఉంటుంది. కాంగ్రెస్ తరఫున అహ్మద్ పటేల్ రంగంలోకి దిగనున్నారు. అయితే ఇప్పుడు శంకర్‌ సింగ్ వాఘేలా కాంగ్రెస్‌ కు రాజీనామా చేసి స్వంత పార్టీ పెట్టుకునే ఆలోచనలో ఉన్నారు. కనీసం పదిహేను మంది శాసన సభ్యులు కాంగ్రెస్‌ కు రాజీనామా చేసి వాఘేలాతో చేతులు కలుపనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే గుజరాత్ నుండి రాజ్యసభకు జరుగనున్న ఎన్నికల్లో అహ్మద్ పటేల్ విజయం సాధించచటం కష్టమని అంటున్నారు. ఇప్ప‌టికే వాఘేలా కాంగ్రెస్‌ కు చెందిన కనీసం ఇరవై ఐదు మంది శాసన సభ్యులను తనవైపు తిప్పుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. ఆయన ఎత్తులు పారితే గుజరాత్ నుండి అహ్మద్ పటేల్ రాజ్యసభకు ఎన్నిక కావటం దాదాపుగా కష్టమని చెబుతున్నారు.

మ‌రోవైపు సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు - రాజ్యసభ సభ్యురాలు అంబికాసోని హిమాచల్ ప్రదేశ్ - ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఇన్‌ చార్జి బాధ్యతల నుండి తప్పుకోవటంతో కాంగ్రెస్ అధినాయకత్వం ఈ బాధ్యతలను మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్ షిండేకు అప్పగించింది. సీనియర్ నాయకుడు సుశీల్‌కుమార్ షిండేను సోనియాగాంధీ హిమాచల్ ప్రదేశ్ ఇన్‌చార్జి ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదీ తెలిపారు. సోని రాజీనామా ఆమె వ్య‌క్తిగ‌త‌మైన నిర్ణ‌య‌మ‌ని పేర్కొన్నారు.