పోర్న్ స్టార్ పై షేన్ వార్న్ దాడి

Mon Sep 25 2017 09:46:12 GMT+0530 (IST)

తాగితే మనిషిని కానని మరోసారి నిరూపించుకున్నాడు ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్.  లండన్ నైట్ క్లబ్ లో తప్పతాగి అక్కడున్న పోర్న్ స్టార్ వేలెరీ ఫాక్స్ పై  దాడి చేసి పోలీసు కేసులో ఇరుక్కున్నాడు. పాపం... షేన్ వార్న్ దారుణంగా కొట్టడంతో ఆమె కన్ను వాచిపోయింది.
    
షేన్ వార్న్ దాడికి సంబంధించిన ఫోటోలను ఆమె ట్విట్టర్ లో పోస్టు చేసింది.  ఓ మహిళపై చేయి చేసుకొని గర్వంగా ఫీలవుతున్నావా? అంటూ ఆమె తన ట్విట్టర్ లో పోస్టు చేసింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నువ్వు ఎంత ఫేమస్ అయితే మాత్రం ఓ మహిళను కొట్టి తప్పించుకుందామనుకుంటున్నావా? అంటూ ఫాక్స్ మరో ట్వీట్ చేసింది.
    
షేన్ వార్న్ మహిళల విషయంలో ఇలాంటి పనులు చేయడం కొత్తేమీ కాదు. 2000 సంవత్సరంలో ఓ బ్రిటిష్ నర్సుకు బూతు మెసేజ్ లు పంపించి వైస్ కెప్టెన్సీ పదవిని వార్న్ కోల్పోయిన సంగతి తెలిసిందే. 2005లో ఇతర మహిళలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ వార్న్ భార్య సిమోన్ అతనికి విడాకులిచ్చింది. ఇన్ని జరిగినా వార్న్ తీరు మాత్రం మారలేదు.