Begin typing your search above and press return to search.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచైతే మోతే

By:  Tupaki Desk   |   9 Oct 2015 4:45 AM GMT
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచైతే మోతే
X
ఎయిర్ పోర్ట్ లో యూజర్ ఛార్జీల వ్యవహారంపై తాజాగా వచ్చిన తీర్పు పుణ్యమా అని.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రయాణం చేసే ప్రయాణికుల మీద యూజర్ ఛార్జీల మోత మోగనుంది. దేశ.. విధేశాలకు వెళ్లే ప్రయాణికుల నుంచి యూజర్ డెవలప్ మెంట్ ఛార్జీలు వసూలు చేసేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి నిర్వహిస్తున్న జీఎంఆర్ వసూలు చేయనుంది.

గతంలో దేశీయ ప్రయాణాలకు రూ.450.. విదేశీ ప్రయాణాలకు రూ.1700 చొప్పున వసూలు చేసేవారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. యూజర్ డెవలప్ మెంట్ ఛార్జీలు వసూలు చేయొద్దని ఎయిర్ పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. దీనిపై జీఎంఆర్ కోర్టును ఆశ్రయించింది.

దీనిపై నడిచిన కేసుకు సంబంధించి తాజాగా హైకోర్టు విమానాశ్రయ యాజమాన్యానికి అనుకూలంగా తీర్పును ఇచ్చింది. దీంతో.. ఇకపై శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రయాణమయ్యే దేశ.. విదేశీ ప్రయాణికులపై ఛార్జీల మోత పడనుంది. అయితే.. ఈ మొత్తం ఎంత అన్న విషయంపై స్పష్టత రానప్పటికీ.. ఓ మోస్తరుగా బాదుడు ఉండొచ్చని చెబుతున్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ యూజర్ ఛార్జీల భారం ఎంతో తేలనుంది. ఇక.. భారం ఎంతమంది మీద పడుతుందన్న విషయానికి వస్తే.. ఈ సంఖ్య దాదాపు 50లక్షల మంది మీద పడుతుందని చెబుతున్నారు.