Begin typing your search above and press return to search.

కొడుకు విష‌యంలో కేసీఆర్ మ్యాజికే చేసేశాడుగా

By:  Tupaki Desk   |   28 May 2017 5:36 PM GMT
కొడుకు విష‌యంలో కేసీఆర్ మ్యాజికే చేసేశాడుగా
X
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ వెల్ల‌డించిన స‌ర్వే రిపోర్టులోని కొన్ని అంశాలు ఆయ‌న‌కు ఇర‌కాటంగా మారే ప‌రిస్థితి క‌నిపిస్తోందని అంటున్నారు. టీఆర్ఎస్ఎల్పీ స‌మావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ తాను తాజాగా చేయించిన స‌ర్వేలో టీఆర్ఎస్ పార్టీకి 111 సీట్లు ఖాయ‌మ‌ని, మిగిలిన ఎనిమిది సీట్ల‌లో ఆరు ఎంఐఎం, రెండు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంద‌ని తేల్చిన సంగ‌తి తెలిసిందే. ఇదే స‌మ‌యంలో ఎమ్మెల్యేల ప‌నితీరుపై కేసీఆర్‌ ర్యాంక్‌లు సైతం ఇచ్చారు. అయితే ఈ ర్యాంకింగ్ విష‌యంలోనే సీఎం కేసీఆర్ తీరును కాంగ్రెస్ పార్టీ ప్ర‌శ్నించింది.

కాంగ్రెస్ పార్టీ శాస‌న‌మండలి నేత షబ్బీర్ అలీ తాజాగా మీడియాతో మాట్లాడుతూ గొప్ప లాజిక్ ప్రశ్న అడిగారు. కేసీఆర్ చేయించిన గత సర్వేలో ఆయ‌న త‌న‌యుడు, మంత్రి కేటీఆర్ కి 46 % ఆద‌ర‌ణ ఉంద‌ని తేలిందని...ఇప్పుడు 91% ఆద‌ర‌ణ‌ ఎలా వచ్చిందని ష‌బ్బీర్ అలీ ప్ర‌శ్నించారు. ముఖ్యమంత్రి కుమారుడిగా కేటీఆర్ ఇంటికో ఉద్యోగం ఇవ్వ‌డం వ‌ల్ల‌ 91 వచ్చిందా అని ఎద్దేవా చేశారు. ఏం చేశార‌ని ఒకే సారి రెట్టింపు కంటే ఎక్కువ‌గా కేటీఆర్ ర్యాంక్ పెరిగింద‌ని ష‌బ్బీర్ అలీ నిల‌దీశారు. కేసీఆర్‌కు త‌న‌ సర్వేపై అంత నమ్మకం ఉంటే...త‌న కుమారుడు కేటీఆర్ పాలనా బాగుంటే సిరిసిల్ల ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎలక్షన్ కి రావాలని స‌వాల్ విసిరారు. లేదంటే కొడుకు విష‌యంలో కేసీఆర్ మ్యాజిక్ చేసేశార‌ని అనుకోవాల్సి వ‌స్తుంద‌ని తెలిపారు.

కేసీఆర్ సర్వే ఒక బోగస్ సర్వే అని ష‌బ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. ``కేసీఆర్ దమ్ముంటే సర్వే పై నమ్మకం ఉంటె రేపే ఎన్నికలకు రా`` అంటూ స‌వాల్ విసిరారు. త‌న పార్టీ ఎమ్మెల్యేలు లేదా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి అయినా ఎన్నికలకు రావాల‌ని, కేసీఆర్ కు త‌న‌ సర్వేపై నమ్మకం ఉంటే సవాల్ స్వీకరించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్ధంగా ఉంద‌ని ష‌బ్బీర్ అలీ స్ప‌ష్టం చేశారు.