Begin typing your search above and press return to search.

మిస్ట‌రీకే మిస్ట‌రీ!..ఆ 7 డెడ్ బాడీలు ఎవ‌రివో?

By:  Tupaki Desk   |   18 Feb 2018 10:33 AM GMT
మిస్ట‌రీకే మిస్ట‌రీ!..ఆ 7 డెడ్ బాడీలు ఎవ‌రివో?
X
క‌డ‌ప జిల్లాలో ఇప్పుడో వార్త పెద్ద సంచ‌ల‌నంగా మారింది. నేటి ఉద‌యం వెలుగులోకి వ‌చ్చిన ఈ వార్త స‌మ‌యం గ‌డిచే కొద్దీ అటు పోలీసుల‌తో పాటు ఇటు జ‌నానికి కూడా హై టెన్ష‌న్ పెంచేస్తోంది. మొత్తానికి స‌మ‌యం గ‌డుస్తున్న కొద్దీ ఈ మిస్ట‌రీ సంచ‌ల‌నం మ‌రింత మిస్ట‌రీగా మారిపోతోంది. ఒకే చెరువులో ఏకంగా ఏడు మృత‌దేహాలు క‌నిపించ‌డ‌మంటేనే సంచ‌ల‌నం. అస‌లు ఆ త‌ర‌హా ఘ‌ట‌న‌ను ఊహించ‌డానికే భ‌య‌మేస్తుంది. అలాంటిది ఒకే చెరువులో ఏడుగురి మృత‌దేహాలు తేలియాడుతూ క‌నిపించిన వైనం ఇప్పుడు తెలుగు ప్ర‌జ‌ల‌ను తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేస్తోంది. చెరువులో విగ‌త‌జీవులుగా మారి నీటిపై తేలియాడుతున్న స‌ద‌రు వ్య‌క్తులు ఎవ‌ర‌న్న విష‌యంపై ఇప్ప‌టిదాకా ప్రాథ‌మిక వివ‌రాలు కూడా తెలియ‌రాలేదు. అంతేనా... ఇదేదో సాధార‌ణ జిల్లాలో జ‌రిగితే అంత‌గా భ‌య‌పడాల్సిన అవ‌స‌రం లేదేమో గానీ... ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాలు బాగా రాజ్య‌మేలిన క‌డ‌ప జిల్లాలో ఈ త‌ర‌హా ఘ‌ట‌న వెలుగు చూస్తే... ఆ మృత‌దేహాలు ఎవ‌రివి అన్న ప్ర‌శ్న నిమిష నిమ‌షానికీ టెన్ష‌న్‌ను పెంచేస్తోంది. పొద్దున్నే అటుగా వెళ్లిన క‌డ‌ప జిల్లా వాసుల‌కు చెరువులో తేలియాడుతూ ఏడు మృత‌దేహాలు క‌నిపించ‌డంతో వారు బెంబేలెత్తిపోయారు. వెంట‌నే పోలీసులకు స‌మాచారం అంద‌జేయ‌గా... ఖాకీలు కూడా హుటాహుటీన అక్క‌డ‌కు ప‌రుగులు పెట్టారు.

అయితే ఆ త‌ర్వాతే అస‌లు టెన్ష‌న్ మొద‌లైంది. అస‌లు ఆ చెరువులోని డెడ్ బాడీలు ఎవ‌రివ‌న్న విష‌యంపై చిన్న క్లూ కూడా ల‌భించ‌క‌పోవ‌డంతో ఇప్పుడు పోలీసులు జుట్టు పీక్కుంటున్నారు. అంతేనా... ఒకేసారి ఒకే చెరువులో ఏడుగురు చ‌నిపోయిన వైనంపై వివ‌రాలు తెలియ‌డం లేదంటే దాని వెనుక ఎంత పెద్ద క‌థ ఉందోన‌న్న కోణంలో ఇప్పుడు ఈ అంశం వైర‌ల్‌గా మారిపోయింది. ఇక అస‌లు ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళితే... క‌డ‌ప జిల్లా ప‌రిధిలోని ఒంటిమిట్ట చెరువులో ఆదివారం ఉద‌యం 7మృతదేహాలు క‌నిపించాయి. స‌ద‌రు మృత‌దేహాలు ఎప్ప‌టి నుంచి ఉన్నాయో తెలియ‌దు గానీ... నేటి ఉద‌యం అటుగా వెళ్లిన స్థానికులు చెరువులో మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు మృతదేహాలను వెలికి తీయించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పోలీసుల ప్రాథమిక విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.

మృతులు ఎర్రచందనం కూలీలుగా అనుమానిస్తున్నారు. శనివారం రాత్రి ఎర్రచందనం అక్రమ రవాణా జరుతుందనే సమాచారం అందుకున్న పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఓ ఎర్ర చందనం లారీ తారసపడింది. ఇందులో 30 మంది కూలీలు ఉన్నట్లు సమాచారం. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా, వారిలో కొంత మంది కూలీలు చెరువులోకి దూకి ఉంటారని భావిస్తున్నారు. ఊపిరి ఆడక మృతి చెంది ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ విష‌యంపై ఎక్క‌డా క్లారిటీ రావ‌ట్లేదు. దీంతో అస‌లు ఈ ఘ‌ట‌న‌కు కార‌ణం ఏమైం ఉంటుందన్న విష‌యం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది. అస‌లు చ‌నిపోయిన వారు ఎవ‌రు? ఏ కార‌ణంతో వారంతా చ‌నిపోయారు? దీని వెనుక ఉన్న అసలు క‌థ ఏమిటి? అన్న ప్ర‌శ్న‌లు ఇప్పుడు జ‌నం మ‌దిని తొలిచేస్తున్నాయి.