మళ్లీ రాకెట్ పట్టిన సానియా...వైరల్!

Thu Aug 09 2018 21:46:01 GMT+0530 (IST)

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.....మళ్లీ టెన్నిస్ రాకెట్ పట్టుకుంది.....తనదైన శైలిలో సర్వ్ చేస్తూ...ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టింది....మునుపటి సానియాలాగే బలమైన షాట్లు కొడుతూ....తన ఆటలో పదును తగ్గలేదని ప్రూవ్ చేసింది.....ప్రస్తుతం ఏడు నెలల గర్భవతిగా ఉన్న సానియా....రాకెట్ పట్టడమేమిటని ఆశ్చర్యపోతున్నారా? అయితే సానియా ఏదో అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదులేండి.....తన `హోమ్`గ్రౌండ్ లో రాకెట్ పట్టి....తన సోదరినే ప్రత్యర్థిగా చేసి ఓ ఆటాడుకుంది. 2 రోజుల క్రితం తన సోదరి ఆనమ్ మీర్జాతో కలిసి టెన్నిస్ ఆడుతున్న వీడియోను తన  ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో సానియా షేర్ చేసింది. గర్భవతిగా ఉండి కూడా ఆటపై మక్కువతో రాకెట్ పట్టిన ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.గర్భవతి అయిన సానియా కొంతకాలంగా ఆటకు దూరంగా ఉంటోన్న సంగతి తెలిసిందే. అయితే గర్భిణిగా ఉన్నా....ఆటపై మక్కువ చావని సానియా....సరదాగా తన సోదరి ఆనమ్ తో కలిసి టెన్నిస్ ఆడింది. ఆ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో  పోస్ట్ చేసింది. ఎంత ప్రయత్నించినా టెన్నిస్ కు దూరంగా ఉండలేకపోతున్నానని క్యాప్షన్ పెట్టింది. టెన్నిస్ క్రీడాకారుల నుంచి కోర్టును దూరం చేయగలరేమో కానీ - ఆటను కాదు కదా అని పోస్ట్ చేసింది. ఈ వీడియోపై సానియా అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 7 నెలల గర్భిణి అయినా....సానియా అదరగొట్టేసిందని వారు కితాబిస్తున్నారు. ఆటకు తాత్కాలిక విరామం ఇచ్చినా ఛాంపియన్ ఎప్పటికైనా ఛాంపియనే అని కామెంట్లు పెడుతున్నారు.